బ్లాగులో తెలుగు బాగుగా వెలుగు

తెలుగు భాష వెలుగులు జిలుగుల బ్లాగులో

Monday, May 2, 2016

VANI TRISATI - THREE HUNDRED POEMS IN TELUGU ON CONTEMPORARY ISSUES- WITH TRANSLATION IN ENGLISH PROSE AND TELUGU PROSE





తెలుగు భాషలో ఛందోబద్ధంగా పద్యం వ్రాయడం అతి క్లిష్టమైన ప్రక్రియ. 11  తరగతి తరువాతతెలుగు వ్యాకరణంతో పూర్తి బంధం తెగి పోవడమూ
తదుపరి జీవితమంతా ఎక్కువగా ఆంగ్ల భాషాపుస్తకాలే చదవడం వల్ల తెలుగులో కొంతనైనా చందోబద్ధంగా పద్యం రాయాలన్న నా కోరిక అలానేమిగిలి పోయిందిఐతే నా తృష్ణ చల్లారనిది . ప్రయత్నిస్తూనే ఉన్నానుకాని ఏనాడూ ఒక్క పద్యంకూడ పూర్తి చెయ్యలేదు.

It is a difficult proposition to attempt to write a poem in Telugu grammatically. I lost total touch with Telugu grammar rules which are complex after my 11th class. As I was totally engrossed in reading and dealing in English, this desire to write a poem in Telugu remained a dream. But my appetite is unquenchable. So, time and again, I have been trying and failing in the process. But, I could never complete even a single poem.
ఎట్టకేలకునా రాణి వాణి పై ఒక పద్యం మొదలు పెట్టానుచిన్నతనాన నేర్చుకున్న వ్యాకరణసూత్రాలులఘువులుగురువులువృత్తాలుయతిప్రాసలు ఒక్క సారి మననం చేసుకున్నానునాభార్య సలహా తీసుకున్నానుపద్యం పూర్తయ్యాకఆమె కొన్ని తప్పులు దిద్దింది.
ఐనా కొన్ని లోపాలు ఉండవచ్చునాకు తెలిసి ఒక చోట యతి గతి తప్పిందికుదరలేదుసరైనపదంవదిలెశాను.
ఇక మీ ఓపిక.

At last with the blessings of Goddess Vani and with wishes from my wife Vani, I recalled the grammar rules I learned during my school days, referred a few books, took my wife’s advice, as she knew Telugu better than me and compiled the first poem on Godess Vani and Vani. This is called Champakamala, in Telugu lingo. There might be errors and as I stay in Mumbai, I had no option but to depend on my wisdom. As far as I know, there is one clear error. Please correct, if you have knowledge of Telugu grammar.

వాణి శతనానికి నాందీ పద్యము.

కుసుమ లతా విధాన మొక మందర మారుత తుల్య భాషణల్
తరుణివి నీదు భార మతి నేర్పున తీర్పున మ్రోయు ధీమతిన్,
చిన్నతనమందె కష్టముచె భారము మీరగ తీర్పున భరిం
చి సుమ పరీమళంబు శుచి జల్లిన నా యలివేణి వాణికిన్!

Dedicated to Goddess of Knowledge, Vani.

నా చదువుల రాణి వాణికి అంకితం.

Like a creeper blooming with flowers that moves lightly during wind, your words are so mild and touching. As a lady of the house, when you entered our house, you bore your burden with proper judgment and intelligence. When very young you faced unbearable troubles with aplomb. Like the flower creeper, you spread the sweet smell of flowers in my life. I dedicate this to the one woman in my life, Vani.



వాణి శతకం PART 8



లేదు నీరు రాత్రి నిదుర పట్టక పోయె
వాన లేక భూమి వట్టి పోయె
కడవతొ పసి కూన కోసుదూరము పోయె
వాణి పలుకు మాట నాదు నోట! 279

తాత్పర్యము  

ఈ బొమ్మలోని చిన్న పిల్లల దీనావస్థను చూసి వ్రాసిన పద్యమిది. నీరు లేదు. నిదుర లేదు. మూడేళ్ళు వానలు లేక భూమి నెర్రెలు వేసింది.  కడవ నెత్తిన పెట్టుకొని ముక్కు పచ్చలారని పసి బిడ్డలు మైళ్ళు నడుచుకుంటూ పోతున్నరు.  



కాల మహిమ యేమొ కాలు చుండెను భూమి
భానుడేమొ భగ భగ మను చుండె
నరక మాయ భూమి నరులకు తరులకు
వాణి పలుకు మాట నాదు నోట! 280

తాత్పర్యము  


కాల మహిమ కాబోలు భూమి మండి పోతున్నది ఎండలతో. సూర్యుడు తన ప్రతాపాగ్నిని చూపిస్తున్నాడు. నరులకు, తరులకూ కుడా భూమి నరక మయి పోయింది. 

Image result for drought images


మడుగు యెండి పోవ మొసలి బయటి కొచ్చె
కనుల నీరు లేవు కార్చ గాను 
ఘనుడు నేత మొసలి కన్నీరు కార్చగ  
సిగ్గు తోడ మొసలి సచ్చి పోయె!  281

తాత్పర్యము  

ఈ బొమ్మలో మొసలి ఎండలకు మడుగు ఎండి పోతే బయట పడి ప్రాణాలు వదిలింది. దాని కళ్ళలో నీరేదీ కార్చడానికి? (మొసలి కన్నీరు తెలుసు కదండీ?) . కానీ నాయకుల కళ్ళల్లో కన్నీరు ఎండదు. వాళ్ళు మొసలి కనీరు కారుస్తూనే ఉంటారు. 

Image result for drought images


తాత్పర్యము  


తెలుగు మిత్రు లొకరు "టీటోన్ముఖు" లనిరి
చంద్ర శేఖరు డనె చాల బాగు
శ్రీనివాసు డాయె సిరి వెన్నెలకు సాటి
వాణి పలుకు మాట నాదు నోట! 282

తాత్పర్యము  

ఈ మధ్య శ్రీనివాసుడనే  మిత్రులొకరు, నా బ్లాగులు వారిని ట్వీటోన్ముఖుల్ని చేస్తున్నాయని గొప్ప పద ప్రయోగం చేశారు.  చంద్రశేఖరులు ఈ ప్రయోగాన్ని మెచ్చుకున్నారు. ఆ సందర్భంగా ఆశువుగా వ్రాసిన పద్యము.  
తెలుగు మిత్రులొకరు ట్వీటోన్ముఖులన్నారు. చంద్రశేఖరులు "వహ్వా" అన్నారు. శ్రీనివాసు గారు సిరి వెన్నెల సీతారమ శాస్త్రి గారి సరి సమాను లయ్యారు.   


ఫ్లైట్ లోన పోయి ఫైట్ చేసెను కన్న
ట్వీటు చేయ బర్ఖ (అక్క) లేటు కాదు
కల్ల కన్న డెరుగు కధలు బర్ఖ తెలుపు
వాణి పలుకు మాట నాదు నోట! 283

తాత్పర్యము  

ఈ మధ్య మన "ఆజాదూ"(బర్ఖా భాషలో ఆజాదీ)  కన్నయ్య స్పైసు జెట్టు విమానంలో ఎగురుతూ, ఓ కల కన్నారు. తనను ఎవరో గొంతు పిసుకుతున్నారని. ఆ సందర్భం ఈ పద్యానికి ప్రేరణ.

ఫ్లైటులో వెళుతూ కన్నయ్య ఫైటు చేశాడు. ఏ మాత్రం ఆలస్యం (లేటు) చెయ్యకుండా బర్ఖ అక్క ట్వీటు చేసింది. కన్నడికి "కల్ల" లాడడం తెలుసు.  అక్కకి కధలల్లడం తెలుసు.  


పన్ను నీవు కట్టు ఫ్లైటు యెక్కెనతడు
బెయిలు కోర యతడు బీద వాడు
తల్లి పేరు చెప్పి తప్పు కొనెను ఖైదు
వాణి పలుకు మాట నాదు నోట! 284

తాత్పర్యము  

 పన్నులు మీరు కడుతూ ఉండండి. మన "ఆజాదూ"(బర్ఖా భాషలో ఆజాదీ)  కన్నయ్య స్పైసు జెట్టు విమానంలో ఎగురుతూ ఉంటాదు.బెయిలు అడిగేప్పుడు మాత్రం అతను బీద వాడు.ఖైదు తప్పుకోడానికి అతను తల్లి పేరు చెప్పుకున్నాడు కదా! 


యెక్కువయ్యె ననుచు యేడ్వకు పనిచూసి
చేయు వాడు వేరె సేయ వీవు
నవ్వు కొనుము హాయి కొవ్వు పెరుగ జూసి
వాణి పలుకు మాట నాదు నోట! 285
Laugh U never do!

తాత్పర్యము

పని ఎక్కువైందని ఈ మధ్య ఓ పెద్ద మనిషి అందరి ముందూ ఏద్చాడు కదండీ. ఆ సందర్భం.  

పని ఎక్కువైందని ఏడవకు. మాకు తెలుసు నువ్వు చేసేది తక్కువ, వేరే వాళ్ళు చేసేది ఎక్కువ. కొవ్వు పెరిగిందని చూసుకొని హాయిగా నవ్వుకో, నాయనా!    


కప్పు లోన కాఫి కవిలోన చతురత
యింటి లోన శాంతి యింతి కాంతి
మనిషి లోన మమత మనసుకు విశ్రాంతి
వాణి పలుకు మాట నాదు నోట! 286

తాత్పర్యము  

"చెప్పు లోని రాయి"  వేమన పద్యానికి అందమైన అనుకరణ.

కప్పులో వేడి కఫీ, కవిలో ఉండే చతుర భాషా శక్తి, ఇంట్లో మనశ్శాంతి, యింతి (భార్య) ముఖంలొ కాంతి (ఆనందం), మనిషి లో ఉండే మమత ఇవన్నీ మనసుకు స్వాంతన కలుగ చేస్తాయి కదా! 


బారు లోన బీరు కుండ లోపల కల్లు
వైను షాపు లోన ఫైను బ్రాంది
తాగి యిల్లు చేర తలుపు తీయదు తరుణి
వాణి పలుకు మాట నాదు నోట! 287

తాత్పర్యము  

"చెప్పు లోని రాయి"  వేమన పద్యానికి అందమైన అనుకరణ. ఓ పేరడీ.  

బారు లోపల బీరు, కుండలోని కల్లు, వైను దుకాణంలో మంచి బ్రందీ తాగి ఇల్లు చేరితే భార్య తలుపు తీయదు కదా బీరు బలుడా! 


మాట పొదుపు చేయ మేలు నీకగు నెంతొ
జనుల యార్తి తీర్చు జలము పొదుపు
ఖర్చు లందు పొదుపు కన్న బిడ్డల కాచు
వాణి పలుకు మాట నాదు నోట! 288



తాత్పర్యము 

ముఖ పుస్తకంలో ఓ మిత్రుడి కవిత చూసి ఈ పద్యం వ్రాశాను.

నీ మాటల్లో (మిత భాషణ) పొదుపు ఉంటే నీకెంతో మేలు. నీటిని పొదుపుగా వాడితే నీ సమాజానికి సేవ చేసిన వాడవవుతావు. డబ్బు పొదుపుగా వాడుకుంటే నీ కన్న పిల్లలకి ఎంతో మేలు చేసిన వాడవవుతావు. 

అమ్మ ఆగ్నేయాన అక్క ఈశాన్యాన
అరవ దమ్మ గెలుచు యరచి యక్క
స్కీము స్కాము కలిపి సాపాటు సేయగ
వాణి పలుకు మాట నాదు నోట! 289

తాత్పర్యము  

జయ, మమత జోడీ మీద పద్యము. 

అమ్మ ఆగ్నేయాన్ని ఏలుతోంది. అక్క (దీదీ) ఈసాన్యాన్ని ఏలుతోంది.   అమ్మ అరవది (అమ్మ అరవం మాట్లాడుతుంది అని కూడా అనుకోవచ్చు). అక్క అరిచి, అరిచి గెలుస్తుంది. అమ్మ చుట్టూ అమ్మ స్కీములు, అక్క చుట్టూ తమ్ముళ్ళ స్కాములు. స్కీము, స్కాముల భొజనం వడ్డిస్తున్నారు అమ్మ, అక్క.   



కాసు లున్న యపుడు కాసినొ మధుశాల
డబ్బు వచ్చె నేని ధర్మ శాల
క్షౌర శాల పడగ కత్తెర జేబుకు
వాణి పలుకు మాట నాదు నోట! 290

తాత్పర్యము

పాడుతా తీయగాలో ఈ మధ్య జొన్నవిత్తుల గారు ఒక కవిత చదివారు. కాసినోల మీద. క్షొరశాల అనె పదం వారి నుంచి అప్పు తీసుకుని, మిగిలిన పద్యం నేను కూర్చాను.

కాసులు చేతులో నిండుగా ఉంటే కాసినొ మధుశాల. (మత్తెక్కిస్తుంది అని అర్ధం) డబ్బు లాభం వస్తే అది పెద్ద ధర్మ శాల. (సత్రము వంటిది). జేబుకు కత్తెర పడితే అదే క్షౌర శాల అవుతుంది.     
  


సంద్రమందు పేద సాలె గూడును కట్టె
అలలు యలలుగ కనె కలలు చాల
నేసి వస్త్ర మొకటి నీటి మూటను కట్టె
వాణి పలుకు మాట నాదు నోట! 291

తాత్పర్యము  

పేద, ధనిక తారతమ్యం ఈ క్రింది రెండు పద్యాల్లో కనబడుతుంది. 

మొదటి పద్యం

నడి సముద్రంలో  (సంసార సాగరంలో అనుకోవచ్చు) ఓ పేద వాడు సాలె గూడును కట్టుకున్నాడు. (పేద వాడి గుడిసే ఆ సాలె గూడు). సముద్రంలో లేచి పడే కెరటాల వలెనే ఆశ, నిరాశ అనే కిందికీ, మీదకీ ఎగిసే  అలల వంటి కలలను కన్నాడు. ఎంతో శ్రమ పడి ఆ సాలె గూడులో ఒక వస్త్రాన్ని నేసి దాన్లో నీళ్ళను మూట కట్టుకున్నాడు. (ఏం మిగిలింది చివరకు, చిరిగిన వస్త్రమే)  

సంద్ర మందు ధనికు డింద్ర సభను కట్టె
అలలు యెగిసె యతని కలిమి వోలె
కూడ బెట్టె ధనము కడలి జలము రీతి
వాణి పలుకు మాట నాదు నోట! 292

తాత్పర్యము  

సముద్రంలో (విశాల ప్రపంచం అనుకోవచ్చు) ధనికుడు ఇంద్ర సభను మించి భవంతి కట్టు కున్నాడు. ఆ సముద్రంలో అలౌ పైకి లేస్తూనే ఉన్నాయట అతని ఆస్తి వలె. కడలి ఎంత జలాన్ని కూడ బెట్టిందో అంతటి ధనానై అతను కూడ బెట్టాడట. 


                                                  ################################ 


మందార మకరంద మాధుర్యమున దేలు 
    మధుపంబు వోవునే, మదనములకు? 
నిర్మల మందాకినీ వీచికల దూగు 
    రాయంచ జనునె, తరంగిణులకు? 
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు 
    కోయిల చేరునే, కుటజములకు? 
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం 
    బరుగునే, సాంద్ర నీహారములకు? 

అంబుజోదర దివ్య పాదారవింద 
చింతనామృత పాన విశేష మత్త 
చిత్త మేరీతి యితరంబు జేయ నేర్చు? 
వినుత గుణ శీల, మాటలు వేయు నేల?  



No comments:

Post a Comment