STORIES OF PANCHATANTRA IN SIMPLE TELUGU POEMS - ONLY TELUGU
PART 5
PART 5
For more than two and a half millennia, the Panchatantra tales have regaled children and adults alike with a moral at the end of every story. Some believe that they are as old as the Rig Veda. There is also another story about these fables. According to it, these are stories Shiva told his consort Parvati. The present series is based on the Sanskrit original.
A king, worried that his three sons are without the wisdom to live in a world of wile and guile, asks a learned man calledVishnu Sharman to teach them the ways of the world.
Since his wards are dimwits, Vishnu Sharman decides to pass on wisdom to them in the form of stories. In these stories, he makes animals speak like human beings. Panchatantra is a collection of attractively told stories about the five ways that help the human being succeed in life. Pancha means five and tantra means ways or strategies or principles. Addressed to the king's children, the stories are primarily about statecraft and are popular throughout the world.
Image Courtesy: http://www.indianhindunames.com/panchatantra-stories.htm
विद्वत्त्वं च नृपत्वं च नैव तुल्यं कदाचन ।
स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते ॥
Scholar and king are never comparable. King is worshipped in his country, but scholar is worshipped everywhere.
ఈ రోజు నుంచి పంచతంత్రం కధలను తేలికైన, కమ్మని తెలుగు పదాలతో పద్య రూపంలో వ్రాయాలని సంకల్పించాను. సచిత్రంగా చేసి అందంగా ఉండేలా పిల్లలకు ఉపయోగ పడేలా చెయ్యాలని సంకల్పం. చిత్రాలను వెయ్యడం ఇప్పుడే నేర్చుకోవడం ప్రారంభించాలి కంప్యూటరు సాయంతో.
మరియు నిటుల బలికె మూషిక రాజము
భుక్తి పోయె నాదు శక్తి బోయె
నమ్మకంబు పోయె నా పరి జనులకు
కక్క మింగ లేక క్రుంగి పోతి ! 86
భాగ్య మన్న నేమి భోద పడెను నాకు
కలిమి పోగ యెవరు కలిసి రారు
చక్కెరున్న చోటె చీమలు చేరును
కలిమి దోచు వాడె బలిమి కాడు! 87
మూషికమ్ము పలికె మందరకము తోడ
కలిమి పోగ నేను కుమిలి పోతి
నమ్మి నట్టి జనులు నగుబాటు సేయగ
శత్రు నెదురు కొంటి శక్తి తోడ! 88
దైవ మొక్కడుండు ధనము ధాన్యము నీగ
ప్రాప్త మెంతొ నేను పొందుటెంతొ
నిర్ణయించు నతడె నామ మాత్రమె నేను
బలము కూడ గట్టి పైకి దూకి! 89
ఉట్టి పైన నున్న యతి తిండి చేరగ
జాగరూకు డైన జంగమయ్య
బుర్ర పగుల కొట్ట కర్ర విసిరె కక్ష
దైవ బలము తోడ తప్పు కొంటి! 90
హిరణ్యకుడు తన హృదయ రోదన
దెలుప వాయసమ్ము జాలి పడెను
మందరకుడు చెప్పె మరి రెండు గాధలు
నీతి యున్న దందు రీతి గాను! 91
ధనము యుండు డొకటె ఘనమంచు పొగిడేరు
పంచ కున్న వాడు పేద కాడె
పిసిని గొట్టు వాడు భావ మందున పేద
దాన గుణము లేని ధనియు పేదె! 92
వాయసమ్ము పలికె మూషికు తోడను
మధుర భాష లాడు మిత్రు కంటె
చేదు నిజము పలుకు చెలికాడు శ్రేష్టము
కచ్చపమ్ము తోడ కలిమి మెండు! 93
కశ్యపమ్ము యెలుక కాకియు యచటనె
కబురులాడు చుండె కొలని యొడ్డు
కాల మెరుగరాయె కలిమి చెలిమెయాయె
మిత్ర లాభ మొండు ముదము గూర్చ! 94
గడిచి పోయె నిటులె కతిపయ దినములు
మిత్రు లటులె కూడి ముదము నుండ
హరిణ మొకటి వచ్చె పరుగున వగరుచు
సూసి బెదిరి పోయి స్నేహితులును! 95
వాయసమ్ము యెగిరె వృక్షము పైనకు
యెలుక దూరె చెంత కలుగు లోన
మందరకము మునిగె మడుగు లోపలకును
జింక కాచు టెటుల చింత తోడ! 96
మిత్ర త్రయము యటుల మాటున డాగియు
చింత పడిరి చాల జింక గూర్చి
నీటి కొరకు పరుగొ వేటకాని భయమొ
హరిణి పరుగు తీయ కారణమ్ము! 97
సరసు చెంత చేర హరిణి నిటు లడిగె
కొలను లోన దాగు కచ్చపమ్ము
ఆపదేమి వచ్చె యటుల పరుగు తీయ
యనగ హరిణి నిలిచి యిటుల బలికె! 98
జింక తన పేరు చిత్రాంగు డనియెను
తనదు బాధ చెప్పె దీనము గను
వేట గాడు యమ్ము వేయ తప్పుకొని వేగ
పరుగు తీసి వస్తి మరుగు కొరకు! 99
వలయు నాకు యిపుడు నెలవు దాగు కొనగ
యనగ కశ్యపమ్ము యిటుల బలికె
శాస్త్రములలొ కలవు సూత్రములు యరయ
జింక యడిగె యాస చెప్పు మనుచు! 100
చెప్పె కూర్మ రాజు శాస్త్ర సారములను
పోర వలయు శత్రు బలిమి తోడ
పారి పోగ వలయు పోరి నిలువకున్న
పారి పొమ్ము కావ ప్రాణములను! 101
వాయసమ్ము పలికె వేటగాడు వెడలె
చెట్టు పైన నుంచి చూస్తి నేను
వేట పూర్తి చేసి వెనుకకు మరలెను
చింత మాని మాదు వెంటె యుండు! 102
కొలని కశ్చపమ్ము కలుగులొ యెలుకయు
వాయసమ్ము మాట వినిన యంత
చెలిమి చేసి జింక చింతను పోగొట్టె
కాల మెరుగరాయె కబురు లందు! 103
తిరిగి రాక పోయె హరిణి యొక దినము
మిత్ర త్రయము చింత మునిగి పోయె
మృగరాజు తినెనొ మడుగున పడెనొకొ
వలను చిక్కె నేమొ మరచి మరల! 104
యనుచు దిగులు చెందె హరిణి రాకనె పోయె
కఛ్ఛపంబు బలికి కాకి తోన
మూషికమ్ము నేను మెల్లగ నడిచేము
వెగముగను నీవు యెగిరి చూడు! 105
కొంత దూర మేగి కాకి కనె వేట
గాని వలలొ జింక కొట్టు కొనుచు
జాలి వీడి నన్ను కాలుడు వెంటాడు
యనుచు వగచె చాల హరిణి యయ్యొ! 106
వాయసమ్ము పలికె వలదు చింత పడగ
యెగిరి పోయి తెత్తు ఎలుక మిత్రు
వలను పంట కొరికి విడిపించు వేగమె
యనుచు యెగిరి చనెను యెలుక చెంత! 107
విటము వాయసమ్ము వీపుపై యెక్కగ
జింక చెంత చేరె జంట గాను
యెలుక కొరికె వలను యెంతయొ నేర్పుగ
జింక తప్పు కొనెను చింత బాసి! 108
కృష్ణ శకుని పలికె గాలి మెకము గని
కలిసి రాదొ కట్టె కాటు వేయు
కాల మహిమ మనసు కాలుని తలచును
దైవ చింతె మంచి దారి చూపు! 109
కూర్మ ముండ లేక కదిలెను నెమ్మది
మూషికమ్ము చూసి మదిని వగచె
కష్ట మొచ్చు నపుడు కలిసి నాలుగు వచ్చు
వేట గాడు వచ్చు వేగముగను! 110
జింక నేను కాకి చనెదము వేగమె
కూర్మ మొండు తాను కదల లేదు
చిక్కు పడును వలను చాల కష్తమొచ్చె
కాతు నెటుల నేను కూర్మ మిత్రు! 111
వేటకాడు వచ్చి వృత్తము వలవేసె
యెలుక చెప్పె యొక్క యుక్తి యిటుల
ప్రాణ మొదిలి నటుల పడ వలయును జింక
ప్లావి కనుల కాకి పొడవ వలయు! 112
హరిణికుండు చూసి హరిణి పడి యుండ
సంతసమున పోయె జింక బట్ట
కశ్యపమ్ము నొదిలె కొలని గట్టు పయిన
యెరుగ డాయె మోస మెఱుక యిసుము! 114
వేటగాని చూసి వాయసమ్ము యెగిరె
హరిణి కూడ యురికె హయము రీతి
యెలుక కొరికి పారె వలను కొరికి
కశ్చపమ్ము పోయె కొలను లోకి! 115
బోయ వగచు కొనుచు పోయెను యింటికి
మిత్రు లొక్క చోట మరల చేరి
కబురు లాడు చుండ కాలమె తెలియదు
కాల మహిమ కాదె చెలులు దొరుక! 116
మిత్ర లాభ మనెడు మంచి కధను చెప్పి
విష్ణు శర్మ తెలిపె శిష్యులకును
స్నేహితులను పొంది సుఖమున యుండుడి
జయము కలుగు మీకు జయము జయము! 117
విష్ను శర్మ విరచిత "పంచ తంత్రము" యను నీతి కధలలో రెండవ నీతి "మిత్ర లాభము"
శుభం భూయాత్