బ్లాగులో తెలుగు బాగుగా వెలుగు

తెలుగు భాష వెలుగులు జిలుగుల బ్లాగులో

Sunday, July 24, 2016

Sunday, July 24, 2016



VAALMEEKI RAMAYANA IN TELUGU POEMS WITH ENGLISH TRANSLATION 


 BLOG 1 -- 32 OUT OF 101C POEMS OF 
BALA KANDA, PRADHAMA SARGA

#####################



వాల్మీకి రామాయణాన్ని చక్కని, సులభమైన తెలుగు పదాలతో పద్య రూపంలో వ్రాయాలనే నా సంకల్పానికి ఇది నాంది. నారద మహాముని వాల్మీకి మహర్షికి భవిష్యత్తులో జరగబోయే రామ గాధను వివరించే అంశంతో ఈ కధ ప్రారంభమవుతుంది. సంస్కృత శ్లోకాలను కూడా జతపరిచాను. తెలుగు పద్యాలకు సుళువైన ఆంగ్ల పదాలతో అనువాదము కూడా చేయడం జరిగింది.

బాల కాండము, ప్రధమ సర్గములో 101 పద్యాలలో 32 పద్యాలు మొదటి బ్లాగులో ఇవ్వడం జరిగింది. రెండో భాగము త్వరలో.    

English:  This is my introduction part of a Herculean effort of translating Valmeeki Ramayana into simple Telugu poems. This part contains a description of Sage Narada predicting and narrating the story of Sree Rama to Sage Valmeeki. I reproduced the original Sanskrit Slokas. (It is not an exact translation of the Sloka, though) I translated each poem into simple English. 

This blog contains, Bala Kanda, Pradhama Sarga's 332 poems our of 101 I wrote.  Second blog will floo soon. Bless Me with kind heart.


గణపతి ప్రార్ధన


గణము లెల్ల నీదు కనుసన్నలలొ మెల్గు

యతులు యెల్ల నీకు సుతుల సమము
ప్రాస (ఈటె) విసురు బోయ వ్రాసిన గాధను
వ్రాయ పద్యములుగ వరము నివ్వు !


తాత్పర్యము 



విఘ్న నాయకా! వినాయకా! "గణము" లన్నిటికీ అధిపతి వయి "గణాధిపతి" వయ్యావు కదా! మునీశ్వరులందరికీ తండ్రి వంతి వాడవయ్యా! ప్రాస, అనగా ఈటె విసిరెడి బోయ వ్రాసిన రామాయణాన్ని అచ్చ తెలుగు పద్యాలను చందో బద్ద్ధంగా వ్రాయడానికి అనుమతి నీయవయ్యా! 



ఛందస్సుకు మూలం గణము, యతి, ప్రాస కదా! 




English: This is a  prayer to Lord Ganesha, who controls Ganas to help me to translate the Ramayana written by the great Sage, (progeny of the Lord Himself) Vaalmiki, who was using the spear to hunt animals (He was a hunter by profession)



Here the three words, Gana, Yati and Prasa were used to pray Lord Ganesha. Incidentally, Gana, Yati and Prasa are the three basic rules to write a poem. 



Yati=sage   Trasa: Spear  Ganamulu: seanalu



In Telugu poetry



Yati : The specified number of letter in each "paada" (line) that should sound similar to the first letter of the line. This is specified in Grammar for each type of poem. 



Prassa: The second letter of each line should sound similar. 



Ganamu: It defines the nature of sound a letter makes, like A, AA etc., The letter that takes one "matra" (a measure of time like a single breath) is Laghuve, that which takes two matras is "guruvu". 



హనుమ ప్రార్ధన 


హనుమ నిన్ను కొలువ అణువుల సమమేము
రామ కధను పాడ ఱెల్లు (తృణము) సమము 
ఆటవెలది కంద తేట గీతిక యందు 
రామ కధను చెబుదు బ్రేమ కనుమ!  


తాత్పర్యము 



భక్తుల్లో పరమ భక్తుడు ఆంజనేయుడు. రామునికి అత్యంత ప్రీతి పాత్రుడు. మహా బలశాలి. కామరూపుడు. పర్వతాకారుడు. అలాటి ఆంజనేయా! నిన్ను ప్రార్ధించగా మేమెంత వారము? నీ దైవము శ్రీ రామ చంద్రుని కధ వ్రాయడానికి మేము గడ్డి పోచల సమమే కదా?



నేను ఆటవెలది, తేటగీతి, కందము మొదలుగా కల అనేక ఇతర వృత్తములలో రామ కధను పద్య రూపంలో వ్రాయ సంకల్పించితిని. నన్ను ఆశీర్వదించు స్వామీ! 



English:



Hanuma is the greatest of all devotees of Lord Rama! He is the most liked by Sree Rama. He is unequalled in strength and courage.His body is like a great moutain. In front of him, we are but molecules to pray Lord Rama! In front of the great Devotee Hanuma who recites the name of Rama breathlessly, we are but a piece of hay.  



I am attempting translation of Ramayana in simple Telugu poems. Bless me! My Lord! hanuma!  

దైవ ప్రార్ధన  


యుగము రెండు గడిచె జగము ధర్మము మారె
ధర్మ మొకటి నిలిచె ధరణి పైన 
రామ ధర్మ మొకటె ఋతము ఋతుని వోలె 
రామ గాధ వ్రాయ బ్రేమ కనుమ! 

(ఋతము= సత్యము, ఋతుడు= సూర్యుడు) 


తాత్పర్యము 

త్రేతా యుగము (రామ రాజ్యము), ద్వాపర యుగము (శ్రీ కృష్ణ లీలలు) . రెండు యుగాలు గడిచాయి.  జగతిలో ధర్మం మారింది. కాని ఒక్క ధర్మము మాత్రము జగతిలో అలాగే నిలిచింది. అదే సూర్యుని వలె శాశ్వతమైన  రామ ధర్మము.  అటువంటి రాముని గాధను వ్రాయగా నన్ను ప్రేమతో ఆశీర్వదించు దేవా! 

English: 

Two Yugas, Treata Yug and Dwaapara Yug have passed. In Treata Yug it was about Sree Raama Dharma. In Dwaapara Yug it was the Sree Krishna's acts. Now the Dharma changed with the advent of Kali Yug. But, the one Dharma that did not change was See Rama Dharma. It is permanent like the Sun God.  Please bless me in my adventure of translating such a Great Soul Rama's story in Telugu poems.

శ్రీ రామ ప్రార్ధన 


రాలు కరుగు నంట రామ పదము పాడ

జలము రాలు కంట జనని కధకు
మేలు కలుగు నింట మారుతి భజనతొ
రక్ష సేయు నంట లక్ష్మణుండు!


రామ పదము సోక రాయి యయె యహల్య

రామ కధతొ మారె ఋషిగ బోయ
రామ బాణ మిచ్చె రావణునకు ముక్తి
రక్తి, భక్తి, ముక్తి రామ జపమె!


తాత్పర్యము 



రామ పదము పాడుతూ ఉంటే రాళ్ళే కరుగుతాయట! సీతా మాత కధను వింటూ ఉంటే కళ్ళ వెంట జలము జల, జలా రాలుతుంతుందట! 



మారుతి భజనతో మేలు కలుగునట. లక్ష్మణ స్వామి మనలను రక్షించునట. (సీతా రాముల రక్షణ చేసినట్లే) 



మారుతి భజనతో మేలు కలుగునట. లక్ష్మణ స్వామి మనలను రక్షించునట. (సీతా రాముల రక్షణ చేసినట్లే) 



English: 



If we sing Rama's name, stones are said to melt. If we hear the story of Seeta, tears flow from eyes. If we sing peans of Hanuma, we are helped by Him. And Lakshmana, brother of Rama, protects us fro evil.




Legend says that when Rama touched a stone with his palm the stone turned into a pious lady Ahalya. (Who turned into stone due to the curse of her husband). And that the hunter Vallmeeki turned into a great sage to write Ramayana. And Rama's arrow blessed Ravana to attain higher worlds. Affection, Devotion and Salvation are all ingrained in Rama's legend.   



శ్రీ కృష్ణ లీలలు.



పాండు పత్ని కాచి పరమార్ధము దెలిపె

మన్ను మింగి బాపె మాత మాయ
మామ కంసు చంపె మాయలొ పడకుండ
మురళి ధారి నాదు మాయ బాపె!


తాత్పర్యము 

శ్రీ కృష్ణుడు పాండు పత్నిని కాపాడి పరమార్ధము తెలిపాడట. చిన్ని కృష్ణుడు మన్ను తిని తల్లికి మాయ అంటే ఏమిటో తెలిపాడట. మామ కంసుని చంపి మాయలో కొట్టుమిట్టడకుండా కాపాడట.  ఆ మురళిధారి నా మాయను తొలగించాడు. 

English: 

By saving Panchaali, wife of Pandavas, Sree Krishna showed a way out of worldly pains. Eating a handful of mud he showed the whole universe and Maya surrounding it to His Mother. By killing his uncle Kamsa he helped him out of the Maya. The Lord now removed my Maya! 

హరిహరాభేదము 


ఏక పత్ని వ్రతుడు యయోధ్య రాముడు 
జంట భామ లంట జంగమయకు
నరుగ యవతరించు హరి కధ వ్రాయగ
హరుడు దీవె నిచ్చె శరణు వేడ! 

తాత్పర్యము 

హరి యవతారమైన శ్రీ రామచంద్రుడు ఏక పత్నీ వ్రతుడు. మరి, హరుడో! ఇద్దరు భార్యల ముద్దుల జంగము. నరునిగా అవతరించిన హరి కధ వ్రాయగా నాకు ఆ హరుని దీవనలు కుడా లభ్యమయ్యయి కదా! హైహరాభేదము స్పష్టము! 

English: Rama who is incarnation of Hari, Sree Maha Vishnu, is devoted to his wife seeta. The Lod Shiva has two wives. For me, to translate the story of Sree Rama, the incarnation of Hari, I got blessings of Hara, Lord Shiva! Yet another manifestation of the "inseparability" of Hari and Hara.



                             రామాయణం-పద్య రూపం

గణపతి ప్రార్ధన 


शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् ।
प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॥Shukla-Ambara-Dharam Vissnnum Shashi-Varnnam Catur-Bhujam |

Prasanna-Vadanam Dhyaayet Sarva-Vighno[a-U]pashaantaye ||

Meaning:
1: (We Meditate on Sri Vishnu) Who is Wearing White Clothes, Who is All-Pervading, Who is Bright in Appearance like the Moon and Who is Having Four Hands,
2: Who is Having a Compassionate and Gracious FaceLet us Meditate on Him To Ward of all Obstacles.


శ్రీ రామ ప్రార్ధన 



राम रामेति रामेति रमे रामे मनोरमे ।
सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने ॥Raama Raame[a-I]ti Raame[a-I]ti Rame Raame Manorame |

Sahasra-Naama Tat-Tulyam Raama-Naama Vara-[A]anane ||


Meaning:
1: By meditating on "Rama Rama Rama" (the Name of Rama), my Mind gets absorbed in the Divine Consciousness of Rama, which isTranscendental,
2: The Name of Rama is as Great as the Thousand Names of God (Vishnu Sahasranama).


శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతా పతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజాను బాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి!



मनोजवं मारुततुल्यवेगं
जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठ ।
वातात्मजं वानरयूथमुख्यं
श्रीरामदूतं शरणं प्रपद्ये ।Mano-Javam Maaruta-Tulya-Vegam

Jite[a-I]ndriyam Buddhi-Mataam Varissttha |
Vaata-Atmajam Vaanara-Yuutha-Mukhyam
Shriiraama-Duutam Sharannam Prapadye |

Meaning:
(I take Refuge in Sri Hanuman)
1: Who is Swift as Mind and Fast as Wind,
2: Who is the Master of the Senses and Honoured for His Excellent IntelligenceLearning and Wisdom,
3: Who is Son of the Wind God and Chief among the Monkeys,
4: To that Messenger of Sri Rama, I take Refuge.


 రామాయణము - బాల కాండము  


రామ నిన్ను తలచి రామాయణము రాయ

సీస పద్యములను మూస పోసి

ఆట వెలది కంద తేట గీతి కలిపి

తేనె లొలుకు గాధ హనుమ పలికె!



http://www.valmikiramayan.net/utf8/baala/sarga1/bala_1_frame.htm



శ్లోకము


तपः स्वाध्याय निरताम् तपस्वी वाग्विदाम् वरम् |
नारदम् परिपप्रच्छ वाल्मीकिः मुनि पुंगवम् || 

कः नु अस्मिन् सांप्रतम् लोके गुणवान् कः च वीर्यवान् |

धर्मज्ञः च कृतज्ञः च सत्य वाक्यो धृढ व्रतः || 

चारित्रेण च को युक्तः सर्व भूतेषु को हितः |


विद्वान् कः कः समर्थः च कः च एक प्रिय दर्शनः || 

आत्मवान् को जित क्रोधो द्युतिमान् कः अनसूयकः |

कस्य बिभ्यति देवाः च जात रोषस्य संयुगे ||

एतत् इच्छामि अहम् श्रोतुम् परम् कौतूहलम् हि मे |
महर्षे त्वम् समर्थोऽसि ज्ञातुम् एवम् विधम् नरम् |

పరమ యోగి శాస్త్ర పాఠన ధీశాలి
కల్ల నిజము యెరుగు కౌశలుండు
వాక్కు నందు బ్రహ్మ వివరణందు విరించి 
నారదునకు చేసి నమసు లెన్నొ!  1

వింటి నొదిలి పెట్టి ఘంటము చేబూని
క్రౌంచ పక్షి సాక్షి కవిగ మారి 

ఋషిగ మారి చేయు రచనలు వాల్మీకి

నారదునితొ పలికె నెనరు నిటుల! 2 



యెవరు యట్టి ఘనుడు యెవ్వాని ప్రతిభయు
నడత తీరు గుణము నీతి రీతి
భీతి లేని నియతి పరులయందున గాన
మట్టి పరమ పురుషు మదిని తలతు! 3

అట్టి పరమ పూరుషు నామము తెలియ నిచ్ఛ యాయె యని వాల్మీకి మహా ముని నారదుల వారిని ఎంతయో యాశగా యడిగెను. 4


తాత్పర్యము



యోగి పుంగవుడు, బ్రహ్మ పుత్రుడు, ఙ్ఞాని, శాస్త్ర పాఠములను మొత్తమూ అవపోసన పట్టిన వాడు, నిజము, కల్ల మధ్య భేదము తెలిసిన వాడు, వాక్కు నందు బ్రహ్మ, వివరించి చెప్పడంలో విరించి సముడూ నందు బ్రహ్మ, అయిన నారద మహామునికి ప్రణమిల్లి (1) 



వింటిని త్యాగము చేసి ఘంటము చేత బట్టుకొని, క్రౌంచ మిధునము సాక్షిగా కవిగా మారి రామాయణ రచన చేయ మనః సంకల్ప సిద్ధుడైన వాల్మీకి మహర్షి నారద బ్రహ్మతో నిటుల బలికెను.(2) 


"నాకు ఒక పరమ పురుషుని గూర్చి మదిలో ఆలోచన వచ్చినది మహానుభావా! నా యీ సందేహము తీర్చ మీరే సమర్ధులు. నా ఆలోచనలో మెదులుతున్న ఘనుడు ప్రతిభ లోనూ, తీరు లోనూ, గుణము లోనూ, నీతి లోనూ, బీతి రాహిత్యము లోనూ, నియతిలోనూ పరులెవ్వరూ సాటి రాని వాడు. మీ జ్ఞాన దృష్టితో వీక్షించి నాకు తెలుప గలరు."  (3)  


అట్టి పరమ పూరుషు నామము తెలియ నిచ్ఛ యాయె యని వాల్మీకి మహా ముని నారదుల వారిని ఎంతయో యాశగా యడిగెను. (4) 



English:  Great Sage Vaalmeeki , who sacrificed his family profession of hunting, leaving his bow and arrows in the midst of his sorrow for the death of a male bird out of  a couple and took to writing and intentioned to write the great Epic Ramaayana,  spoke thus to Narada, the son of the worlds Creator , a great Sage, "Oh! The Learned One! I have in my mind a thought about a great persona who is an epitome of great intellect, behavior, character, morality, fearlessness and conduct. No one in the whole Universe is equal to him. I want to know about such a person. Please look through your magic eye and let me know.



In the beginning the qualities of Narada were explained.  He is a Great Yogi, erudite in all the Shastras, a Sawn that can distinguish between a lie and truth, in his word He is Brahma Himself, in explaining the things He is Virinci, His Father. 

భూమాత యొడిలోన ప్రభవించు పురుషుడు
           తనమాట యను బాట తరలు వాడు
నియమంబు తప్ప డు  భయమన్న యెరుగడు
            మనస్సాక్షికి భటుడు మాన ధనుడు 
నిజము బలుకు వాడు నిజశక్తి యుక్తుడు 
             మంచి గుణము వాడు మన్మధ రూపి 
దయగల వాడును దయాశాలియు వాడు    
                     ధైర్యశాలి యతడు దెలివి దిట్ట 

మత్సర మెరుగని మహనీయు డెవ్వరు 
కోప మెరుగ నట్టి ఘనుడు యెవరు 
యుద్ధ భూమి లోన యెదురులే దెవరికి
నాకు దెలుపవయ్య నారద ముని!  5

తాత్పర్యము


వాల్మీకి మరియు నిటుల నారదు నుద్దేసించి పలికెను. "నారద మహమునీ! భూమాత వొడిలో పుట్టినట్టి పురుషుడు, తన మాట యనెడి బాటలోనే వెడలు వాడు (మాట తప్పని వాడు), నియమము తప్పని వాడు, భయము యెరుగని వాడు, మనస్సాక్షికి కట్టుబడెడి వాడు, నిజము మాత్రమే మాటలాడెడి వాడు, స్వయం శక్తి పై ఆధార పడెడి వాడు, గుణము నందు శ్రేష్టుడు, అందమునందు మన్మధుడు, దయ, తెలివి కలగలిపి యున్న వాడు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను జయించిన వాడు, యుద్ధ భూమిలో ఎవరికైతే ఎదురు లేదో అట్టి పరమ పురుషుని విషయము విశదపరచు.     



English: Vaalmeeki further enquired. " Naradaa! Kindly tell me facts about a great person who was born in the lap of Earth, who traverses the pat of his own word. who never crosses the boundary of morality, fearless, one who believes his Soul, who never tells a lie, who is self-sufficient, who is supreme in character, Cupid in beauty, who is a mix of kindness and intellect, who won over the six internal enemies desire, anger, miserliness, attachment, arrogance and jealousy, who has no equal in war field."   




श्रुत्वा च एतत् त्रिलोकज्ञो वाल्मीकेः नारदो वचः |
श्रूयताम् इति च आमंत्र्य प्रहृष्टो वाक्यम् अब्रवीत् ||

వినుము శ్రద్ధ తోన వాల్మీకి మునియంచు
మూడు లోకములను దిరుగు మౌని ఙ్ఞాని  
నారదుండు బలికె నయముగ ముదముగ
సుగుణ శీలి యొకడె చూడ యవని!  6

తాత్పర్యము

ముల్లోకములూ తిరుగుచుండు ఙ్ఞాని నారదుడు వాల్మీకి మాటలు విని అనునయము, సంతోషమూ ఉట్టిపడగా ఇట్ల బలికెను. "ఓ! వాల్మీకి మహర్షీ! శ్రద్ధగా వినుము. ఈ భూమి పైన యట్టి పరమ పురుషుడు ఒక్కడే ఉన్నాడు.


English: On hearing Valmmeeki, the erudite Narada who goes around the three worlds spoke this. "Hear me with attention, Sage Valmeeki! There is one and only one person with these qualities.
 

बहवो दुर्लभाः च एव ये त्वया कीर्तिता गुणाः |

मुने वक्ष्ष्यामि अहम् बुद्ध्वा तैः उक्तः श्रूयताम् नरः ||








అన్ని గుణము లొకచొ యవనిలొ గనలేము


అపరిమితము గుణము లన్ని యొకచొ


యుండ సాధ్య మగునె యవని రాజు లకును


సరళ జనుల కెటుల సాధ్య మగును! 7





వింటి నేను మునుపు వీనుల విందుగ 



తండ్రి నాకు తాత ధాత దెలుప


తెలుప నీకు నాకు కలుగును మోదము


పొసగు గుణములన్ని పురుషు గాధ! 8






తాత్పర్యము

"వాల్మీకి మహర్షీ! నీవు నుడువిన గుణము లన్నీ ఒకే వ్యక్తిలో కాంచుట అనితర సాధ్యము. రాజులలో గనలేని ఈ గుణములన్నీ సామాన్య జనులలో గనుట యెటు సాధ్యము? నా తండ్రి బ్రహ్మ నాకు తెలుపగా నేనెంతో ముదమున అట్టి పరమ పురుషుని కధ విని యుంటిని. నీకు చెప్పుట నాకెంతో ప్రీతి దాయకము. వినుము.

English: It is next to impossible to find all these qualities even in a King, what to tell about rabble? But I heard with pleasure story of one such great person from my Father, the Creator. I have pleasure in narrating the story to you. Please hear."




इक्ष्वाकु वंश प्रभवो रामो नाम जनैः श्रुतः |

नियत आत्मा महावीर्यो द्युतिमान् धृतिमान् वशी ||





विपुलांसो महाबाहुः कंबु ग्रीवो महाहनुः ||
बुद्धिमान् नीतिमान् वाङ्ग्मी श्रीमान् शत्रु निबर्हणः |



महोरस्को महेष्वासो गूढ जत्रुः अरिन्दमः |
आजानु बाहुः सुशिराः सुललाटः सुविक्रमः ||


समः सम विभक्त अंगः स्निग्ध वर्णः प्रतापवान् |
पीन वक्षा विशालाक्षो लक्ष्मीवान् शुभ लक्षणः ||



धर्मज्ञः सत्य सन्धः च प्रजानाम् च हिते रतः |
यशस्वी ज्ञान संपन्नः शुचिः वश्यः समाधिमान् ||



प्रजापति समः श्रीमान् धता रिपु निषूदनः |
रक्षिता जीवलोकस्य धर्मस्य परि रक्षिता||



रक्षिता स्वस्य धर्मस्य स्व जनस्य च रक्षिता |
वेद वेदाङ्ग तत्त्वज्ञो धनुर् वेदे च निष्ठितः ||


सर्व शास्त्र अर्थ तत्त्वज्ञो स्मृतिमान् प्रतिभानवान् |
सर्वलोक प्रियः साधुः अदीनाअत्मा विचक्षणः ||



सर्वदा अभिगतः सद्भिः समुद्र इव सिन्धुभिः |
अर्यः सर्वसमः च एव सदैव प्रिय दर्शनः ||



स च सर्व गुणोपेतः कौसल्य आनंद वर्धनः |
समुद्र इव गाम्भीर्ये धैर्येण हिमवान् इव ||


ఇక్ష్వాకు సంజాతు డినకుల దీపుడు 
   రామ నాముడు దశర రధుని సుతుడు  



భయమె యెరుగ డాత పాపమనిన భీతి  
       ధర్మమెరుగు వాడు ధైర్య శాలి  

నీతి నడుచు వాడు నియమము తప్పడు 
       ఇంద్రియ నిగ్రహము యతని సొత్తు

దక్షత గలవాడు శిక్షించు శత్రుల 
   నేర్చె విద్యల నెన్నొ నీతి వాది 

మచ్చ లేని వాడు మంగళ ప్రదుడట 
జాతి సింగమంటి ఛాతి వాడు    
అంద గాడు యతడు ఆజాను బాహుడు 
శక్తి వంతు డతడు యుక్తి పరుడు! 9


మెఱగు నునుపు తోడ మెఱుగు చెక్కిళ్ళు 

   కంబు కంఠుడు పెద్ద కనుల వాడు  
భుజముల బలిమియు బొడవైన కరములు 

   విరివి నుదురు వాడు వింటి ధారి 

సింగపు నడకతొ శత్రుల దునిమెడు 
     అమరిన చక్కటి అవయవ రీతి
మెఱయు దేహము వాడు మేన కాంతితొ వెల్గు  
    స్వీయ ప్రకాశు డైన సైనికుండు 



దైవ గుణము లెల్ల దనరు వాడతండు
సభ్య తెరుగు వాడు సత్య శీలి 
జాగరూకు డతడు జనుల కాచు 
పరమ పురుషు డతడు పూజ లందు! 10



తాత్పర్యము
ఇక్ష్వాకు వంశమున జన్మించిన వాడు, సూర్య వంశానికి వెలుగు తెచ్చిన వాడు, దశరధ మహారాజు కొమరుడు, రామచంద్రుడు యనెడి నామధేయుడు, భయమన్నదే లేని వాడు ఒక్క పాప భీతి తప్ప, ధర్మము తెలిసిన వాడు, ధైర్య శాలి, నియమము తప్పక నీతి బాటలోనే నడచు వాడు, ఇంద్రియములను నిగ్రహించిన వాడు, శతృవులను శిక్షించ శక్తి కల వాడు, ఎన్నో శాస్త్రములను అభ్యసించి యందలి నీతిని గూర్చి పలుకు వాడు, తన గుణ గణాల విషయంలో ఏ విధమైన, యెట్టి మాట పడని వాడు,  మంగళప్రదుడు, జాతి సింగము వలె బలమైన ఛాతి  కలవాడు, ఆజాను బాహుడు, అంద గాడు, శక్తివంతుడు మరియు యుక్తి పరుడు. మెరుగైన నునుపుతో మెరిసెడి చెక్కిళ్ళు కల వాడు, శంఖము వలె కంఠము కలవాడు, పొడవాతి చేతులు, భుజముల బలము కలిగినవాడు, విశాలమైన నుదురు కలవాడు, విల్లు ధరించిన వాడు, సింహము నడుచు నటుల ఠీవిగా నడచు వాడు , శత్రువులను సంహరించు వాడు, చక్కగా అమర్చిన అవయవములు గల వాడు, మెరిసెడి దేహము కల వాడు, స్వయం ప్రకాశుడు, సైనికుడు, దైవ గుణములు కలిగిన వాడు, సంస్కారము తెలిసిన వాడు, నిజము బలుకు వాడు, తనను రక్షించుకొనుచు జనుల కాపాడెడి వాడు, ప్రజలచే పూజలందుకునే పరమ పురుషుడు!   



English: Narada further enunciated thus the qualities of the one man who is Supreme in qualities. "He is born in Ikshvaaku Dynasty. He is the leading light of the Surya Vamsa. (Son God's progeny),  son of King Dasaradha, by name Sree Raamachandra. He is not afraid of anyone and anything except sinning. He knows the Dharma (virtue, righteousness, Principle of Cosmic Order), courageous. He never crossed the limits of principles, always treads the path of morality. He conquered the senses, he is capable of punishing the enemies. He studied all Sacred Scriptures and speaks about the morality taught therein. He never compromised on his good qualities. His presence has positive aura. He has chest that equals a lion king, His arms are lengthy and strong, he is handsome, he is omnipotent and knows the art of strategy. His cheeks shine with smoothness, his neck resembles a conch, his shoulder-strength is immense. His forehead is very wide, he carries a bow with him. He walks like a lion. His body parts are symmetric and his body shines like moon. He is self-resplendent, a soldier.  He possesses qualities of Gods.  He knows how to behave with intrinsic moral values, he only speaks truth. He can protect himself and protect his subjects. He is adored as God! 


చక్రవర్తిని బోలు చెలువము ముఖమందు 
     దైవ సముడు దేవ దేవు డతడు
లోక రక్షకు డాత శోకము బాపును  
     తండ్రి వంటి వాడు తన జనులకు
నిజము నిజాయతి నీతి కాచెడి వాడు
     వేద విద్య లందు వైదికుండు 
బుద్ధి కుశలతను బహుదా విజయుడు 
    నమ్ము వారి నెపుడు నెనుచు వాడు 

శస్త్ర విద్య లన్ని చదివె నతడు 

విల్లు విద్య లోన వీరు డతడు 
ధార ణందు సములు తనకు లేరు 
యుగము కొక్క డొచ్చు జగము కాచ!  11

తాత్పర్యము

చక్రవర్తి ముఖ వర్చస్సు కలవాడు.దేవ దేవుడతడు. జనుల శోకాన్ని బాపెడి లోక రక్షకుడు. తన ప్రజలకు తండ్రి వంటి వాడు. నిజము, నిజాయితి, నీతి ప్రజలలో ఉన్న వాటిని కాచెడి వాడు.వేద విద్యలు నేర్చిన వైదికుడు. బుద్ధి కుశలతలో అపజయమునెరుగని వాడు. తనను నమ్మిన వారిని కాచెడి వాడు.శస్త్ర విద్యా నిపుణుడు. విలు విద్యలో వీరుడు.ధారణ శక్తి యపరిమతముగా కల వాడు.అలాంటి వ్యక్తి యుగమున కొక్కడే ఉండును, వాల్మీకి మహర్షీ! 

English:  "Lord Rama has the visage of an emperor.  He is God of Gods. He is the Protector who offers solace to troubled souls. He is like Father to his subjects. He protects those who follow morality, truthfulness and truth. He is an adroit learner of Vedas. He is unconquered in his intellect and talent. He protects the believers. He is adept in usage of weapons of all kinds. Specially he is a connoisseur in archery. He has immeasurable capacity to absorb knowledge. Such a person is born only once in a Yuga, Valmeeki Maharshi!" said Narada.
  


యెల్ల లోకములలొ  యారాధింతు రతని 

నెమ్మదైన వాడు నీతి పరుడు
సంద్రమందు నదులు సోలు రీతి
ముక్తి నిచ్చు నతడు భక్తి చేర! 12


కాన రూపు యతని కన్నుల పండుగ

సమము చూచు నతడు సకల జనుల
కన్న తల్లి ముదమె కౌసల్య తనయుని 
విధియు నిధియు మొదటి వేద వాక్కు! 13





శ్రేష్టు డతడు గురువు సకల గుణము లకు 
మహిమ కలుగు వాడు మహిత ఙ్ఞాని 
హిమపు పర్వతమ్ము హడలు శక్తి యుతుడు
రామ కధను పాడ రాలు కరుగు! 14

తాత్పర్యము

రాముని అన్ని లోకముల లోను ఆరాధింతురు.  రాముడు నెమ్మదస్తుడు.నీతి తప్పని వాడు.నదులన్నీ ప్రవహించి సముద్రుని చేరి ముక్తి పొందునట్లే, జనులు భక్తితో రాముని దరి చేర వారికి ముక్తి లభించును.   


రాముని కనులార చూడగా కన్నుల పండుగ. ప్రజలందరిని సమ భావముతో చూచెడి వాడు. రాముని విధి, నిధి, వేద వాక్కు కన్నతల్లి కౌసల్య మనసుకు ముదము చేకూర్చడమే!   



రాముడు శ్రేష్టమైన   గుణములు కల వాడు.  సకల గుణాభి రాముడు. మహ ఙ్ఞాని, మహిమాన్వితుడు, ఆతని శక్తికి హిమాలయ పర్వతము కూడా బెదరును. అటువంటి రాముని కధ వ్రాయ/పాడ రాళ్ళు కూడా కరుగుతాయి.  



English: Rama is adored in all the worlds.  He is calm and quiet. He never crosses the moral fiber. As all the rivers reach the Ocean to attain salvation, people through the Bhakti Route can attain salvation. To look at Lord Rama is a treat to the eyes. He looks after all subjects with equanimity. His duty, his treasure and his Veda is to keep his mother Kausalya in good spirits.



He is superior in qualities. He is a scholar par excellence. He is a miracle of miracles.  Even the great Himalaya Mountain fears him. To sing the story of such a great personality is good Karma. While hearing the story even stones melt.






శ్లోకము




विष्णुना सदृशो वीर्ये सोमवत् प्रिय दर्शनः |
ल अग्नि सदृशः क्रोधे क्षमया पृथ्वी समः || 
धनदेन समः त्यागे सत्ये धर्म इव अपरः |



तम् एवम् गुण संपन्नम् रामम् सत्य पराक्रमम् ||
ज्येष्टम् श्रेष्ट गुणैः युक्तम् प्रियम् दशरथः सुतम् |
प्रकृतीनाम् हितैः युक्तम् प्रकृति प्रिय कांयया || 
यौव राज्येन संयोक्तुम् ऐच्छत् प्रीत्या महीपतिः 



तस्य अभिषेक संभारान् दृष्ट्वा भार्या अथ कैकयी || 
पूर्वम् दत्त वरा देवी वरम् एनम् अयाचत |
विवासनम् च रामस्य भरतस्य अभिषेचनम् ||



स जगाम वनम् वीरः प्रतिज्ञाम् अनुपालयन् |
पितुर् वचन निर्देशात् कैकेय्याः प्रिय कारणात् ||



तम् व्रजंतम् प्रियो भ्राता लक्ष्मणः अनुजगाम ह |


स्नेहात् विनय संपन्नः सुमित्र आनंद वर्धनः || 

भ्रातरम् दयितो भ्रातुः सौभ्रात्रम् अनु दर्शयन् |



रामस्य दयिता भार्या नित्यम् प्राण समा हिता || 

जनकस्य कुले जाता देव मायेव निर्मिता |

सर्व लक्षण संपन्ना नारीणाम् उत्तमा वधूः || 

सीताप्य अनुगता रामम् शशिनम् रोहिणी यथा |



पौरैः अनुगतो दूरम् पित्रा दशरथेन च || 

शृन्गिबेर पुरे सूतम् गंगा कूले व्यसर्जयत् |
गुहम् आसाद्य धर्मात्मा निषाद अधिपतिम् प्रियम् || 
गुहेअन सहितो रामो लक्ष्मणेन च सीतया |



ते वनेन वनम् गत्वा नदीः तीर्त्वा बहु उदकाः || १-१-३०

चित्रकूटम् अनुप्राप्य भरद्वाजस्य शासनात् |

रंयम् आवसथम् कृत्वा रममाणा वने त्रयः || १-१-३१

देव गन्धर्व संकाशाः तत्र ते न्यवसन् सुखम् |


चित्रकूटम् गते रामे पुत्र शोक आतुरः तथा || 
राजा दशरथः स्वर्गम् जगाम विलपन् सुतम् 

गते तु तस्मिन् भरतो वसिष्ठ प्रमुखैः द्विजैः || 
नियुज्यमानो राज्याय न इच्छत् राज्यम् महाबलः |
स जगाम वनम् वीरो राम पाद प्रसादकः || 


వెలుగు రేని వంటి వదనము గలవాడు 
శంఖపాణి మించు శూరు డతడు 
సహన శీల మందు సురభి మాతను మించు
ప్రళయ యగ్ని వోలె ప్రచండుండు!  15



ధర్మ బుద్ధి యందు ధనపాలు సముండు
దయను పంచు టందు ధర్మ మతడు 
నిజమె రామ బలము నిక్కము యెంచగ
రామ జయము జగతి రాగ మయము! 16



ప్రజా శ్రేయ మొకటె బాధ్యత ప్రభువుకు
విలువ లెరుగు వాడు విష్ణు సముడు 
దశరధునికి యతడు తొలుదొల్త కొమరుడు 

తండ్రి కెంతొ ప్రేమ తనయు చూడ! 17


తాత్పర్యము

చంద్ర బింబము వంటి ముఖము కలవాడు.  విష్ణు మూర్తిని మించు వీరుడు. భూమాతను మించిన ఓర్పు కల వాడు. అగ్ని దేవుని మించిన ప్రచండ తాపము చూపెడి వాడు. ధర్మ బుద్ధిలో కోశాధికారికి సముడు. దయను చూపునపుడు ధర్మమే మానుష రూపంలో వచ్చిందా యను సందేహము కలగనోపు. రాముని బలము నిక్కము. రాముని యొక్క జయము జగతికి రాగమయము.  ప్రభువుగా ప్రజా శ్రేయమే యాతని పరమార్ధము.  విలువలు తెలిసిన విష్ణుమూర్తి సమానుడు. దశరధ మహారాజుకు మొదటి కుమారుడు. ఆ తండ్రి పంచ ప్రాణములు రాముని పైనే.    



English:



Sree Rama's face is as glowing as the Moon.  He is a better warrior than Lord Vishnu. He releases firepower equivalent to Lord Agni, the God of Fire! He is more honorable than the treasurer of the King. He is kinder than the Dharma itself.His strength is true. His victory is sweett to the worlds.  As a ruler the welfare of his subjects is His goal. He knows human values like Lord Vishnu.  He is the first of the four sons of King Dasaradha. The King loved him more than he loved his own life.




యువరాజు పదవికి యభిషిక్తు సేయగ 

   రాజు దశ రధుడు రాము నెంచె 



వరుస మొదటి పుత్రు వారసు సేయుట 

   సాంప్రదాయ మదియె సేగి (చిక్కు) లేదు



జనుల శ్రేయ మదియె జనవాక్కు యదియెగ

    కలతతొ చిన రాణి కైక వరము  



గురుతుకు తెచ్చెగ భరతుకు రాజ్యము  

    కౌసలేయుడు పోగ కానలకును   



ధర్మ బద్ధు డైన దశరధ రాజుయు

దాశరధి యంపె దవము లకును

తండ్రి మాట మేర తనయుడు రాముడు

తరలె వనము కేగ ధైర్య శాలి!  18


తాత్పర్యము

అట్టి శ్రీ రాముని యువ రాజుగా పట్టాభిషిక్తుడిని చేయ సంకల్పించి, మొదటి పుత్రుని యువరాజుని చేయుట యనేది సాంప్రదాయము ననుసరించి, దశరధుడు నిర్ణయము చేసెను. సాంప్రదాయము ప్రకారము శ్రీ రాముడు దశరధ మహా రాజు వారసుడగుట చేసి, యే చిక్కు లేదని మహారాజు సంతసించెను. ప్రజా శ్రేయ్ము అదే, జన వాక్యమూ అదే. కాని రాజు గారి చిన్నరాణ్, ఆయనకు ప్రీతిపాత్రమైన కైకేయి, మునుపు రాజు తనకు ఇచ్చిన రెండు వరములు ఇప్పుడు కోరుకొనెను. కౌసల్య తనయుడు కానలకేగ వలయును,  తన కుమారుడు భరతునికి పట్టాభిషేకము చేయవలెనని. ధర్మ బద్ధుడైన దశరధ మహారాజు, శ్రీ రాముని అడవుల కేగమని అదేశమిచ్చెను. తండ్రి మాటను జవ దాటని రాముడు వనముల కేగ సంసిద్ధుడయ్యెను. 




English: As per tradition, King DaSaradha  decided to anoint Sree Rama, his eldest son, to the throne as crown prince. He was happy that there was no obstacle to make Rama, the eledest as Crown Prince. It was in the interests of the people of the Kingom and also people's will. But the youngest and the most loving wife of the King Kaikeyi sought the two boons that he promised long back. She wished Lord Rama sent to forests and her own son Bharata made the Crown Prince. As a king that followed ultimate Dharma, Dasaradha advised Rama to proceed to the forests and as a son that never opposed his father Lord Rama prepared to go to forests.





    


పావన జన్ముడు పినతల్లి కొమరుడు

    లక్ష్మణు నాముడు లలిత గుణుడు 



నొదలడు సోదరు నిమిషము నయినను 
    తోడుగ రాముని తాను వెడలె 

భరతాగ్రజు బత్ని భూమిజ జానకి 
    పరమ పావని సీత పతికి తోడు 

తానును జనియెను కానకు ముదముగ  
    రాముని యాత్మయె రామ పత్ని  

జనక రాజ పుత్రి కాణాచి గుణముల
దొరికె భూమి యందు దైవ ఘటన
వామ నయన భూజ రాముని జత గనె
నాతి సీత రాము నీడ యాత్మ!  19

తాత్పర్యము

శ్రీ రాముని పినతల్లి సుమిత్ర కొడుకు, పావనుడు చిన్నతనము నుంచి అన్న రాముని సహచర్యము నొదలని లలితమైన గుణము కల వాడు అయిన లక్ష్మణుడు అన్న తోడుగా తానునూ వనములకేగ సిద్ధమయ్యెను. 

జనక రాజ పుత్రి, గుణవతి, జనకుని పూర్వ జన్మ పుణ్యమున భూమిలో దొరికిన సీత, వామనయన, పరమ పావని, శ్రీరాముని ఆత్మ, రాముని సహధర్మచారిణి అయిన జానకి తాను కూడా భర్త వెంట వనముల కేగ సిద్ధమయ్యెను.  


English: Son of Sumitra, the aunt of Sree Rama, Lakshmana the pious one, who never left Rama's side even for a split second since childhood and who is soft natured, also got ready to leave to forests with Sree Rama.



The wife of Rama, his soul, daughter of Janaka who found her in the lap of Mother Earth due to his good Karma and God's blessings, the most pious one Janaki too got ready to go to the forests. 



తరలె నగర మయోధ్య దశరధు జతగ 
      వనము కేగగ రాము వెంట సీత

గంగ యొడ్డును చేర గుహుడు కలిసె రాము
       రామ భక్తు డతడు రాజు యచట 

యడవి జాతి జనుల యొక పట్టణమునకు 
       రాము డొదిలె యచటె రధము రధికు 

అనుజుడు భువిజయు  యనుసరించంగను 
       దాటె యడవు లెన్నొ దాశరధియు 


నిండ నీరు యున్న నదులను దాటిరి
దీవెనలను పొంది దేవ ఋషుల 
తుదకు చేరు కొనిరి తపసి భరద్వాజు 
యాశ్రమమున ఋషియు యెంతొ మురిసి! 20    

తాత్పర్యము
  

రాముడు సీతతో కూడి అడవులకు వెడల బయలు దేరగా, దశరధునితో సహా అయోధ్య నగరమంతా వారికి వీడుకోలు చెప్పడానికి వారితో తరలి వెళ్ళిందట. వారు గంగా నది యొడ్డుకు చేరగానె అడవి జాతి జనుల రాజు, రామ భక్తుడు అయిన గుహుడు రాముని కలిసెను. అచటనె రధమును, రధికుడైన సుమంత్రుని వదిలి సీత రామ లక్ష్మణులు ముందుకు సాగిరి. సోదరుడు, సీత తనను అనుసరించగా రాముడు ఎన్నో అడవులు దాటి ముందుకు సాగెను.  నీరు నిండుగా యున్న నదులనెన్నో దాటిరి. ఎందరో మహా ఋషుల ఆశీస్సులను తీసుకొని, చివరగా వాల్మీకి ముని శిష్యుడయిన భారద్వాజుని ఆశ్రమమునకు చేరుకొనిరి.భారద్వాజ మహర్షి కూడ వారిని చూసి పరమానందము చెందెను.    


English: As Sree Rama left for the forests accompanied by Seeta the whole populace of Ayodhaya Town, not excluding King Dasaradha accompanied them. Soon after they reached the banks of the Holy River Ganges, Sree Rama met with Guha, the King of tribal people and a devotee of Rama. Sree Rama bid farewell to the Charioteer Sumantra there and sent back the chariot. Accompanied by wife Janaki and bother Lakshmana, Sree Rama crossed many forests/ They crossed many river overflowing with water/  They got blessed by many great Sages on the way. Finally, they reached the hermitage of Bharadwaja, the disciple of Valmeeki. Sage Bharadwaja was elated to see the great persona, Sree Rama.






        

సోదరుండు  సతియు జతగూడి నడువగ 
     యాన తీయ గురువు మాన ధనుడు 

చిత్రకూటమునకు చనియె సంతసమున
     యచట తీర్చి దిద్ది రందముగను 

పర్ణశాల యొకటి పరమార్ధ భావన 
      కలిమి యదియ యాయె కాన లందము 

సురలు దైవ సముల సరితూగ సుఖములు
      రాచ నగరము శోభ యచటె కనగ

చిత్ర కూట మందు సుఖము సంతో
షమును మిగుల పొంద శమము మరచి
మురిపించె మనముల మరిపించె యయోధ్య 
వనము శోభ యెంతొ ఘనము గాను! 21



తాత్పర్యము

"మానధనుడైన రాముడు, భరద్వాజుని యానతితో సోదర,సతీ సమేతముగా చిత్రకూటమనే పర్వతమునకు చేరుకొనిరి. అచట అందమైన ఒక పర్ణశాల నిర్మించుకొని వనములలో ప్రకృతి యంద చందాలను మహా భాగ్యముగా భావిస్తూ, దేవతల సమముగా సుఖాలను అనుభవిస్తూ కాలము గడిపిరి.శమ, దమాదులను మరిచి చిత్రకూటములో సుఖ, సంతోషాలతో గడుపుతూ  ఆ వనముల సౌందర్య పిపాసలో తమ అందమైన అయోధ్యా నగరాన్ని సైతము మరిచి పోయారు, తాపసీ!" యని నారదుడు ఇంకనూ ఈ విధముగా చెప్పెను. 

English:" On the advice of Sage Bharadwaja, Sree Rama accompnied by wife and bother proceeded to a hillock named Chitrkuuta. There they made a pretty, cute and beautiful hermitage. They started living there enjoying the beauty of the forest around, the pleasant environment opf the secluded place forgetting the daily pressures of material life. They lived a life not unequal to that of angels. And soon they forgot their own beautiful capital Ayodhya and all the luxuries it offered. " so told Narada to Valmeeki and furthered the story-tellig thus.




गत्वा तु स महात्मानम् रामम् सत्य पराक्रमम् |
अयाचत् भ्रातरम् रामम् आर्य भाव पुरस्कृतः || 
त्वम् एव राजा धर्मज्ञ इति रामम् वचः अब्रवीत् 





रामोऽपि परमोदारः सुमुखः सुमहायशाः ||

न च इच्छत् पितुर् आदेशात् राज्यम् रामो महाबलः |





पादुके च अस्य राज्याय न्यासम् दत्त्वा पुनः पुनः 
निवर्तयामास ततो भरतम् भरत अग्रजः |

स कामम् अनवाप्य एव राम पादा उपस्पृशन् || 

नन्दि ग्रामे अकरोत् राज्यम् राम आगमन कांक्षया |


"Unfulfilled is the desire of Bharata in taking back Rama to kingdom, hence on touching Rama's feet and taking sandals, he returned from Chitrakuta, and without ruling from capital Ayodhya, he carried on the kingdom from a village called Nandigrama, with an expectation of Rama's return... 



రాము పైన మమకారము రాగము 

వదల లేక ప్రాణ మొదిలె తండ్రి  
రధిరుండు  లేని రధము తీరాయె 

ప్రభుత లేని రాము పట్టణంబు! 22


విప్ర వరులు గురువు వాశిష్ట మునియును 

రాము తమ్ము భరతు రాజ్య మేల 

చెప్పి రెంత గానొ చెవిని బెట్టడు తాను

కల్మషమ్ము లేని కైక సుతుడు! 23 



ఆశ లేని వాడు అన్న వదిన లన్న

తల్లి దండ్రు లంచు తలచు వాడు  

అన్న లేని రాజ్య మది యేల నాకంచు

భరతు డేగె కాన బిలువ రాము! 24 



కాల మీద బడెద కడిగెద కన్నీట
మొక్కు కొనెద యన్న మరలి రమ్ము 
మీరు లేని రాజ్య మేల నా కనియెద 
యన్న రాడొ యుండి పోదు కాన! 25


యిటుల నిశ్చయించి యడవి దారిని బట్టె 

భరతు డరిగె కాన బరువు మనసు   
సత్య సంధుడైన  సోదరు పాదము 
పైన బడియు మొక్కె భరతు డిటుల! 26


అన్న లేని రాజ్య మదియేల నాకును

నీవె వచ్చి మమ్ము నేలు కొనుము 
యనగ రాము డిటుల యనుయయించె భరతు
తండ్రి మాట దాట తగదు నాకు! 27


తండ్రి మాట మేర తరలి వస్తి వనము

తిరిగి వచ్చుటన్న తప్పు కాదె  

సూర్య వంశజులన్న సత్యము తప్పరు

భరత నీవు యిపుడె పొమ్ము తిరిగి! 28


చక్రవర్తి యనగ చుక్కాని ప్రజలకు

త్రోవ చూప నీదు ధర్మ మదియె 
యనగ యనియెభరతు డనుగు సోదరుడిటు

తమరి మాట దాట తగదు నాకు! 29


అన్న మాట దాట యటులనె కానిండు 

పాల కుండు మీరు పుణ్య వంత

పాదుకలను ఇండు పట్టము కట్టెద 
పాలించెదను పాద  ధూళి సాక్షి! 30  



ప్రీతి దీవనిచ్చి పంపె తమ్ము భరతు
పాదుకలను ఇచ్చి ప్రేమ తోడ  
 
భ్రాత్రు పాదుకలను పాలకునిగ చేసి 
యనుజు  డేలె రాజ్య మతని భటుగ! 31



నంది గ్రామ మనెడి నూతన గ్రామ
రాచ వీడు చేసి రాజ్య మేలె
అన్న లేని రాజధాని యుండగ లేక 


పాదుకలను చేసి పాలకులుగ! 32 

"ఇదిలా ఉండగా, అయోధ్యలో దశరధ మహా రాజు, రాముని పైన ప్రేమ, 
మమకారము వదులుకో లేక దిగులుతో ప్రాణములు వదిలెను. వారసుడు, 
ప్రభుత్వము లేని కోసల రాజ్యము రధికుడు లేని రధము వలె యాయెను.  రాజ
 పురోహితులు, వశిష్ట మునీంద్రుడు తదితరులు రాముని తమ్ముడు భరతుని 
రాజ్యాధికారము తీసుకొన వలసిందిగా అనేక విధాలుగా చెప్పి చూశారు. కాని 
కల్మషము లేని కైకేయి సుతుడు చెవిని బెట్ట లేదు.   



అన్న, వదినలన్న తల్లి దండ్రులతో సమానముగా భావించెడి వాడు, ఆశ లేని వాడు అయిన భరతుడు "అన్న లేని రాజ్యము నాకేల" అనుచు అడవుల దారి బట్టెను."అన్న కాళ్ళ మీద పడి మొక్కుకొనెదను. అన్నా! నీవు లేని రాజ్యము నాకేల?" అని ప్రాధేయ పడతాను.తిరిగి వచ్చి నీ రాజ్యము నీవే ఏలుకొనుము అని ప్రార్ధిస్తాను. రాక పోయిన యెడల నేను కూడా అన్న గారితో అడవుల లోనే ఉండి పోతాను."

ఈ విధముగా పరి, పరి విధముల యోచించుచూ బరువైన మనస్సుతో భరతుడు అరణ్యమున కేగి, సత్యమునకు మారు పేరైన రాముని కాళ్లపైన బడి ఈ విధముగా వేడెను. "అన్నా! నీవు లేని రాజ్యము నాకేల?  మమ్ములనందరినీ నీవే ఏలుకొనుము." అనగా రాముడు "భరతా! తండ్రి మాట జవ దాట నాకు తగదు. తండ్రి మాట మీదే మేము అడవులకు తరలి వచ్చాము కదా? ఇపుడు తిరిగి వచ్చుటన్నచో, తండ్రి మాటకు విలువ ఇవ్వనటులే కదా? సూర్య వంశజులు సత్యము తప్పరు. నా మాట విని నీవు తిరిగి అయోధ్యకు వెడలుము"  


"చక్రవర్తి యనగా ప్రజలకు సన్మార్గము చూపు చుక్కాని వంటి వాడు. ఇపుడు నీ ధర్మము కూడా రాజుగా ప్రజలను మంచి దారిలో యుంచి పాలించుటే.: అనగా భరతుడు, "అన్నా! మీ మాట జవ దాటడము నాకునూ తగదు. అటులనే వెడలెదను. కాని, పుణ్యవంతా! ఆ రాజ్యము మీదే. నేను కేవలము మీ అధికారిని మాత్రమే. మీ పాదుకలను ఇండు. వాటికే పట్టము కట్టి, మీ పాద ధూళి సాక్షిగా రాజ్యాన్ని మీ పరిచారకుడిగా ఏలుకుంటాను." అనెను. శ్రీ రాముడు ప్రేమతో భరతుని దీవించి తన పాదుకలను ఇచ్చి పంపెను. ఆ పాదుకలకే శాస్త్రోక్తముగా పట్టాభిషేకము చేసి, భరతుడు రాముని భటుడిగా రాజ్యాన్ని ఏలడము ప్రారంభించాడు. 


అన్న లేని అయోధ్యలో ఉండలేక, భరతుడు నందిగ్రామమనే ఊరిని రాజధానిగా చేసి, రాముని పాదుకలు రాజుగా రాజ్యము చేసెను. 


English: In Ayoadhya, Dasaradha could not bear the separation of Sree Rama from him. His love and his attachment to Rama soon took the better of his health and he succumbed. The Kosala Kingdom became a chariot without the charioteer to steer it in right path. The Brahmin gurus of the Kingdom and VasishTa, the Raja Guru, tried their best to convince Bharata to adorn the Crown and rule the people. But, the blot-less and selfless Bharata refused.. Selfless Bharata, who sees his own parents in his brother and sister-in-law thought, " I will go to the forests and fall on the feet of Rama. I will tell him that I do not require the kingdom where He is not there. I will ask him to come back and rule all of us.In case he does not return, I will stay back in forests with my brother" So thinking, with heavy heart Bharata went to the place where Rama was living the life of a Hermit. He pleaded with Rama to come back and rule the kingdom. But Rama refused saying that so doing will be sacrilege as he will be committing the sin of failing on his word given to his father. He told him that the progeny of the Sun God never failed on their word. And Rama advised Bharata to return to Ayodhya and perform his duty. "A ruler is like a rudder that shows the right path to the subjects. Your sacred duty. now, is to rule and again show the right path to our people"  

Bharata agreed. "Brother! I agree. But is your kingdom. I am only your servant. Please give me your footwear. I will crown them as king and with the blessings of the dirt particles on them, I will rule." Sree Rama blessed Bharata and handed over his footwear.  Bharata went back and unable to stay in Atodhya without Rama, made a village named Nandigrama as the capital, crowned Rama's footwear as king and started ruling Kosala Kingdom.

No comments:

Post a Comment