బ్లాగులో తెలుగు బాగుగా వెలుగు

తెలుగు భాష వెలుగులు జిలుగుల బ్లాగులో

Wednesday, January 18, 2017

STORIES OF PANCHATANTRA IN SIMPLE TELUGU POEMS - TELUGU WITH ENGLISH TRANSLATION



PART 6 

WITH ENGLISH TRANSLATION



For more than two and a half millennia, the Panchatantra tales have regaled children and adults alike with a moral at the end of every story. Some believe that they are as old as the Rig Veda. There is also another story about these fables. According to it, these are stories Shiva told his consort Parvati. The present series is based on the Sanskrit original.
A king, worried that his three sons are without the wisdom to live in a world of wile and guile, asks a learned man calledVishnu Sharman to teach them the ways of the world.

Since his wards are dimwits, Vishnu Sharman decides to pass on wisdom to them in the form of stories. In these stories, he makes animals speak like human beings. Panchatantra is a collection of attractively told stories about the five ways that help the human being succeed in life. Pancha means five and tantra means ways or strategies or principles. Addressed to the king's children, the stories are primarily about statecraft and are popular throughout the world

                                                                                                                               
             

विद्वत्त्वं  नृपत्वं  नैव तुल्यं कदाचन  



स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते  


Scholar and king are never comparable. King is 



worshipped in his country, but scholar is worshipped 




everywhere. 







మిత్ర లాభ గాధ ముగిసిన పిదపను
మిత్ర భేద కధను మొదలిడగను
విష్ను శర్మ యాన విష్నువు యాశీస్సు
తెలుగు తల్లి యొక్క దీవ నొండు ! 1


తాత్పర్యము



మిత్ర లాభము యనెడి కధ ముగిసిన పిదప, మిత్ర భేదము యనెడి కధను సుళువైన తెలుగు పద్యములుగా వ్రాయుటకు శ్రీ మహావిష్ణువు యాశీస్సు మరియు శ్రీ విష్ణు శర్మ యానతి యయినది..


EnglishAfter completion of the part containing the story of "Gaining of Friends" Lord Vishnu blessed and the author "Panchatantra" Sree Vishnu Sarma ordered that I proceed to translate the next part "Losing of Friends" in simple Telugu Poetry form.



మృగము రాజు వద్ద మంత్రు లిర్వురు వారు

కరట కుండు దమన కుండు యంచు
వారి నడుమ సాగు వాదమె యీ గాధ
విష్ణు శర్మ చెప్పె శిష్యు లకును!  2


తాత్పర్యము



కరటకుడు, దమనకుడు అనే ఇరువురు మంత్రులు మృగరాజు వద్ద మంత్రులుగా కొలువుండిరి. వారిరువురి నడుమ సాగే సంభాషణల సారాంశమే ఈ "మిత్ర భేద" మనెడి కధ యని విష్ణుశర్మ శిష్యులకు కధ చెప్ప సాగెను.



English: In the Court of the King of the Jungle two  Ministers by names Karataka and Damanaka were serving. The gist of the conversations that took place between the two is the story called "Mitra Bhedamu" (Loss of Friends). Thus saying, the Guru Vishnu Sarma started narrating the story.


వర్ధ మాను డనెడు వ్యాపారి యొకడు 
దక్షి ణాది భరత దేశ వాసి
యొక్క దినము నాత యిటులయా లోచించె
ధనము మీదె నడచు ధాత్రి యెల్ల! 3


తాత్పర్యము



వర్ధమానుడనే ఒక దక్షిణ భారత దేశ వణిజుడు ఒక రోజు ఈ విధముగా యాలోచించెను. "ధరణి పైన ప్రతి పనీ ధనము మీదే నడచును కదా! అందు చేతనే ధనమూల మిదం జగత్ అన్నారు పెద్దలు."  



English:  



A merchant from the South of India, by name Vardhamana started thinking thus. 'The whole world moves on money. Money, it is said, the center of the universe, they say.' 

ధనము యెంత యున్న ఘనమగు కీరితి 
కాసు బలము మిన్న కండ కంటె 
మిత్రు లగుదు రపుడు శత్రువులు నిజము
కాణి లేని వాడు గూని సమము! 4


తాత్పర్యము



ధనము ఎంత ఎక్కువగా యున్నచో కీర్తి యంత యినుమడించును. కండ బలము కంటె కూడ కాసు బలము మిన్న. ధనము యున్నపుడు శత్రువులు కూడా మితృ లగుట నిక్కము. కాణి చేతిలో లేని వాడు గూని వానితో సమానము.



English:



The more wealth one possesses the more his honor multiples. Power of wealth is superior than the power of one's muscles. When one possesses more wealth, even the enemies turn close friends. A poor man is equivalent to the physically handicapped.



వాసి వాడ దెపుడు ముసలితనము రాదు 
ఆరు విధము లుండు యాస్తి పడయ
వణిజ వృత్తి మించి వాసి గలది లేదు
ధర్మ మిదియె యంచు దలచె నతడు!  5


తాత్పర్యము



ధనము మిగుల యున్న మన శరీరములో కాంతి తగ్గదు,వృద్ధాప్యము ఎన్నటికి రాదు. డబ్బు సంపాదించే మార్గములు ఆరు. కాని వ్యాపారమును మించిన వృత్తి మరొకటి కానము. ఇదియే నా విద్యుక్త ధర్మము యని తలపోసెను. 



English:  If we possess wealth our body glows forever. Old age does not touch us. There are six ways of earning money. But, of all, business is the best profession. This is my moral duty, so thought the merchant, Vardhmana.



మంచి రోజు చూసి మధుర పయనమయ్యె

జమ కూర్చె యొకచొ సరకు లన్ని
విపణి వెదుక బోయె వాణిజ్యము కొరకు
సరకు లమ్మ గాను తరలి పోయె! 6


తాత్పర్యము  


ధర్మ శాస్త్ర రీత్యా ఒక మంచి రోజు చూసి వర్ధమానుడు తాను యమ్మ దలచిన సరకులన్ని యొకచో సమ కూర్చి, ఆ సరకులు ఎక్కడ విరివిగా యమ్ముడు పోవునో యట్టి యంగడిని వెదుక మధురా పట్టణమునకు పయన మయ్యెను.


English:



Thus thinking Vardhamana set off to the Town of Madhura to search for a good market for the goods, he sourced at his place. For this he chose an auspicious day.



అంద మైన విధము యలంక రించెను

యెద్దు బండి యొకటి  యానమునకు
బలియు వృషభ జంట బండికి గట్టెను
పయన మయ్యె వణిజ పుంగవుండు!  7


తాత్పర్యము



తన ప్రయాణమునకు సరిపడ యొక బండిని బాగుగ యలంకరించి దానికి రెండు బలిష్టమైన యెద్దుల జంటను కట్టి , వర్ధమానుడు పయనమయ్యెను.



English: 



Suitably decorating a cart needed for his journey and getting two very sturdy bullocks ready to push the cart, Vardhamana set off on his journey for trade.





యమున దరిని యొక్క యరణ్య మందున

పయన మెంతొ తనకు భార మవగ
యలసి వృషభ మొకటి యచటనె కూలగ
వృషభ మటులె వదలి విపణి కదిలె!  8


తాత్పర్యము



ఈ విధముగా ప్రయాణము చేస్తూ ఆ వర్తకుడు యమునా నది సమీపాన కల యొక యడవి గుండా పోవు సమయమున, ప్రయాణ భారము తట్టుకో లేక ఒక వృషభము యచ్చటనే కూల బడెను. ఆ వర్తకుడు కూడా ఆ యెద్దును అచటనే వదిలి తాను ముందుకు పయనమయ్యెను. 



English: Thus traveling the merchant reached a forest on the banks of River Yamuna, when one of the bullocks collapsed sick of travel fatigue. The merchant moved thither without personally caring for the sick animal.



సొమ్మసిలిన వృషభు సంజీవకుని గావ

సేవకులను విడిచి చనియె వణిజ
వారు పోయి తెలిపి వణిజునకు యిటుల
యెద్దు ప్రాణ మకట యెగిరి పోయె! 9


తాత్పర్యము



సొమ్మసిలి పడి పోయిన ఆ ఎద్దు సంజీవకునికి పరిచర్యలు చేయ కొంత మంది సేవకులను వదలి, వర్ధమానుడు ముందుకు సాగి పోయెను. కాని కొన్ని దినములకె యా సేవకులు పరుగిడి పోయి సంజీవకుడు మరణించెనని వర్తకునకు తెలిపిరి. 



English: The merchant left behind a few of his servants in the forest to look after the health of Sanjeevaka, the bull that fell sick. But in a few days the servants left the bullock there to inform the merchant that he died. 



బ్రతికి యుండె యెద్దు బలము పుంజుకొనెను

తినుచు లేత గరిక తిరుగ సాగె
దవము చెట్టు పుట్ట దనదె యయినటుల
తనివి తీర తిరిగె తొడుకు కాన! 10


తాత్పర్యము



కాని సంజీవకుడు చని పోలేదు. కొన్ని దినములకు కోలుకొని, బలము పుంజుకొని ఆ అడవి లోనీ గడ్డి, గాదము తినుచు ఆ అడవి యంతా తనదైనటుల, అచ్చటి చెట్టు, పుట్ట తనవే యైనటుల అడవి యంతా కలియ తిరుగ సాగెను. ఎచ్చటైనా విశ్రమించు ప్రదేశము కొరకు వెదకు చుండెను. 



English: The sick bulloc did not die. Instead, it recovered, gained in strength by eating the grass in the forest. It startedroaming in the forest in search of a resting place, as if the whole forest were his own and the trees in the forest were his own. 



కాన యందు యుండు కేసరి యొక్కండు

నదము తటికి బోగ నీరు తాగ
మృగము లన్ని రాగ మృగరాజు తోడుగ
శబ్ద మొకటి వినెను శ్రవణ మదర! 11


తాత్పర్యము



అదే అడవిలో నివాసముండే మృగరాజు ఒక దినమున మృగము లన్ని తోడు రాగా నీరు త్రావ నెంచి యొక సరసు యొద్దకు పోయెను. అప్పుడు చెవులు చిల్లులు పడునా యనునటుల యొక గంభీరమమైన శబ్దమును మృగరాజు వినెను. 



English:



The King of the forest lion, accompanied by other animals, went to a lake to drink water. At that time he heard a ferocious noise that almost broke his ear drums.



మంత్రి కొమరు లిటుల మనమున దలచిరి

తంత్ర మందు దిట్ట దమన కుండు
యతని కలిసి సాగు కరటక మను నక్క
పదవి కొరకు మరల పాకు లాడె! 12


తాత్పర్యము



పోయిన పదవి కొరకు మరల పాకులాడుచున్న కరటక, దమనకు లనే ఇద్దరు మంత్రి కుమారులు యచటనే దరిదాపుల నుండిరి. దమనకుడు కుతంత్రమందు  దిట్ట. కరటకుడు యతని యడుగు జాడలలో నడిచే మిత్రుడు. 



English: 



The sons of two ministers under the Lion King, who were trying all means to regain their lost positions in the kingdom were roaming nearby the lake. Damanaka was known for his trickery and Karataka was his follower and friend.


దమన కుండు బలికె కరటకుతొ యిటుల
యేమి యాయె యెరుగ మిటుల రాజు
నెమ్మి యుండు వాడు నిర్వీరు డాయెను
సేమ మెరుగు వంక చేరికగుదు!  13


తాత్పర్యము



తమ రాజు శబ్దం విని వెను తిరిగి పోవుట చూసిన దమనకుడు, కరటకుని చూసి ఇట్లు పలికెను. "మన రాజు కేమి యాయెనో ఎరుగము. ఎంతో ధైర్యవంతుడైన రాజు నేడు భయముతో వెను దిరిగి పోయెను. కారణము తెలిసుకొన వంకతో రాజుకు మరల చేరువవుదును" 



English:



Observing the Lion King backing down from drinking water with the fear of the unknown sound, Damanaka the trickster jackal said thus to Karataka. " We don't know what happened to our king. Usually very cool and courageous, today he went back without drinking water. I will try to earn his patronage again on the pretext of knowing the reason."



కొలువు లోన లేము యేల మనకు చింత

పిలువ కుండ పోవ పోవు పరువు
చీలికందు దూర్చి చేయి విరిగినట్టి
మల్లు గాధ చెబుదు యాలకించు! 14


తాత్పర్యము



అనగా దమనకుడు ఇటుల బలికెను. "రాజు కొలువు లోన లేని మనకు చింత ఏల? పిలవని పేరంటానికి పోయిన మన పరువు పోవును. చీలికలో  దూర్చి చేయి విరగ గొట్టుకున్న కోతి కధను చెప్పెద వినుము"  



English:



Hearing Damanaka, Karataka spoke thus. "  We are no more patronized by the King. Why should we worry? approaching the King without being invited, we lose our honor. I will tell you thee story of a monkey that broke its hand by inserting it in a wooden log split into two. Please hear."



కరట కుండు చెప్పె కోతి కధ నిటుల

వణిజు డొకడు తన వనము నడుమ
గుడిని యొకటి తాను కట్టనా రంభించి
శీఘ్ర గతిని పనులు సేయ గాను!  15


తాత్పర్యము



కరటకుడు కోతి కధను ఈ విధముగ చెప్ప దొడగెను. "శ్రేష్టి యొకడు తన వనము నడుమ గుడి నొకటి కట్ట నెంచి శీఘ్రముగా పనులు చేయించ నారంభించెను."



English: Karataka started telling the story of the monkey thus. " One merchant, with the Divine objective of constructing a temple in the midst of his garden, ordered the workers to complete the work as fast as possible"



కట్టు కూలి జనుల కాష్ట తషుల బిల్చె

వారు రోజు కొక్క మారు విడిచి
పనులు తినగ తిండి పట్టణ ముకు బోవ
కోతి మూక చేరి క్రీడ లాడె!  16


తాత్పర్యము



గుడిని కట్టు కూలి జనులను, చెక్క పానులను చేయ వడ్రంగి వారిని పురమాయించెను.  వారు ప్రతి రోజూ ఒక సమయమందు పనులు విడిచి భోజనము చేయు నిమిత్తము పట్టణమునకు బోవుచుండిరి. ఆ సమయమందు మర్కటముల మూక యొకటి అచ్చట చేరి ఆడుకొనుచుండెను.



English: The merchant ordered construction workers and carpenters for the work. The workers used to leave the work once daily to take food in the nearby town. During that time a group of monkeys used to collect there and play.



చూసె కోతి యొకటి చీలిన దుంగను

చీలి కందు యొక్క చిన్న బెరడు
ఉత్సు కతను మించి యుప్పలి లేదుగ
బెరడు పీక దొడగె మర్కటమ్ము!  17


తాత్పర్యము



ఆ మూక యందలి యొక కోతి, అక్కడ వడ్రంగి వారు వదిలి వేసిన ఒక చీలిన దుంగను ఆ చీలికలో వారు యుంచిన చిన్న బెరడును చూసి ఉత్సాహమును యాపుకొన లేక ఆ బెరడును యూడ బెరుక ప్రయత్నించ సాగెను. 



English: 



One monkey in the group saw a large wooden log split into two by the workers and also small wooden piece kept by them in between so that the split pieces do not again come nearer to each other. Out of over-enthusiasm to do something, the monkey sat on the log and started pulling the small wooden piece kept between the split wooden log.





బెరడు యూడు వరకు పట్టుబట్టెను కోతి

చీలికందు కాలు చిక్కి చచ్చె
తలను దూర్చ నేల తగని విషయముల
కోతి వలెనె మనకు కీడు జరుగు!  18


తాత్పర్యము



ఆ బెరడు ఊడి వచ్చే వరకు కోతి తన ప్రయత్నాన్ని ఆప లేదు. ఆ బేరడు ఊడగానే ఆ రెండు చీలికల మధ్య కోతి కాలు చిక్కుకొని మరణించింది. మనకు అనవసరమైన విషయములలో తల దూర్చిన యెడల ఆ కోతి వలెనె మనకు కూడ కీడు జరుగును.



English:



The monkey did not leave his efforts until the small piece came out Once it came out the two pieces of the log came together and leg of the monkey was caught in between and he died on the spot. If we poke our nose into matters we are not concerned, danger will await us. 



దమనకుండు విని తిమ్మని చేష్టలు 

కడుపు నించు టొకటె కాదు ఫలము 
అభిష లించ వలయు యాశ్రయమ్ము నృపుని
యంచు పెద్ద లనిరి యనుచు బలికె! 19


తాత్పర్యము



కోతి చేష్టల కధను వినిన దమనకుడు ఇటుల బలికెను. "రాజు నాశ్రయించుటకు కారణము కేవలము కడుపు నించుక్నుటొకటే ఫలితము కారాదని పెద్దలు చెప్పిరి.



English:



Hearing the story of the pranks of the monkey, Damanaka spoke thus. " The purpose of serving the King should not be to fill our stomach only, so said elders." 



హితుల కాచు కొనుట శత్రుల దునుమట 

కొరకు రాజు చెంత కేగ వలయు
యనుచు శాస్త్ర వచన మారీతి ఙ్ఞానులు 
సూత్ర పరిచి రెపుడొ శ్రద్ధ వినుము! 20


తాత్పర్యము



మన హితులను కాపాడుకొనుటకు, మన శత్రువులను సమ్హరించుటకు, రాజు నాశ్రయించ వచ్చునని శాస్త్ర కారులు ఎప్పుడో సూత్ర పరచిరి.



English: 



To protect our well-wishers and to eliminate our enemies we can approach the King. This was taught to us by our Sastras long back.




నూరు విధము లుండు నింపుకొనగ బొట్ట 

కడకు లెక్క కొచ్చు కలిమి యెలమి 
ఙ్ఞాన తృష్ణ విద్య జీవికి యనయము (మిక్కిలి)
బతుక వలయు జీవి  పికము వోలె! 21

తాత్పర్యము




ఫేలి మెతుకు తినుచు బతుకును బలిభుక్కు

వాయసమ్ము వోలె వలయె బతుక
మనము ఇపుడు లేము మంత్రి పదవు లందు 
కొందలమున యనియె కరటకుండు! 22


తాత్పర్యము



ఈ మాటలు విని నొచ్చుకొని కరటకుడు  ఇటుల బలికెను.



పొట్ట నింపుకోవడానికి నూరు మార్గాలుంటాయి. చివరకు లెక్కలోకొచ్చేది మన దగ్గరున్న సొమ్ము, మన సుఖమే. మనిషికి ఙ్ఞాన తృష్ణ మిక్కిలి ఎక్కుడు. బ్రతికితే నెమలి వలె బ్రతుక వలె. ఎంగిలి మెతుకులు తిని బ్రతికే వాయసము మాదిరి బ్రతుక వలయునా? అయినా అటుల బ్రతుకుట కయినా మనము మంత్రి పదవులందు లేము కదా? 



English: 



To feed one's stomach there are hundred ways. But, in the ultimate analysis what is seen is our wealth and our happiness. Man is after earning more knowledge. If we live, we should live like a peacock. Should we live like the crow that lives on left overs? Even to live the life of a crow, we are not in the post of minister. 






పాలకులతొ చెలిమి పాముతొ చెలగాట

అడగ కుండ చేయు ఆలోచనలు
మానమునకు చేటు మోసపూరితముయు
మూర్ఖ తొదిలి మంచి మాట వినుము! 23


తాత్పర్యము



"పాలకులతో చెలిమి పాములతో చెలగాట వంటిది.వేరే వారిని సంప్రదించకుండా చేసెడి ఇట్టి ఆలోచనలు మోస పూరితంగాను, మన మాన మర్యాదలకు భంగం కలిగించేవిగాను ఉంటాయి. నీ మూర్ఖత్వాన్ని వదిలి ఇకనైనా నా మాట వినుము" యని కరటకుడు హితబోధ చేసెను.   



English:  Karataka tried to reason with Damanaka thus. "Nearness to rulers is like playing with poisonous snakes.  Taking decisions sans consultation with others are deceitful and turn out to be fatal to personal honor. So, leave forget foolish thinking and hear my words."






కాదు కాదు కాదు కాదనె దమనుడు

శ్రద్ధ తోడ నృపుని సేవ సేయ 
అనతి కాల మందె ఆశ్రయము దొరుకు 
అటుల కాని వాడు అణగి పోవు!  24


తాత్పర్యము



దమనకుడు కరటకుని మాటలను ససేమిరా యని పెడచెవిన బెట్టెను. ఆతడనెను."శ్రద్దతో రాజుల సేవ చేసినచో అతి త్వరలోనే రాజాశ్రయము దొరకును. అటుల చేయని వాడు ఎందుకూ కొరగాని వాడగును."   



English: 



Damanaka refused to hear the words of Karataka. He said," If we serve kings with patience, soon we will find a place in their courts. Otherwise we will be doomed"




నృపుని మనసు యెరిగి నడచు కొనువాడు

అలుక యెపుడు యుండొ అనుగు నెపుడొ
యెరిగి మసలు వాడు యెదుగును ప్రభుతందు
ధరణి పతుల సేవ తప్పు కాదు! 25


తాత్పర్యము



దమనకుడు మరల ఇటుల బలికెను. "రాజు యెపుడు అలుక చెందునో, ఎపుడు ప్రసన్నుడుగా యుండునో యెరిగి మసలుకొనే భృత్యుడు ప్రభుత్వములో ఉన్నత పదవులు అందుకొనును. నృపుల సేవ చేయడము తప్పు కాదు."



English:



Damanaka further said thus. " The courtier who treads carefully knowing the mind of the king like knowing the time he is displeased and when he is happy, will rise to higher positions in the authority. It is never wrong to serve kings."




దమనకుండు బలుక ధీశాలి బలుకులు 

కరటకుండు యడిగె కార్య మేమి 
దరికి చేర ఱేని దారి యేమి దెలుపు 
యనగ దమనకుండు యిటుల బలికె! 26


తాత్పర్యము



కరటకుడు దమనకుని బుద్ధి కుశలతకు సంతసించి ఇటుల యడిగెను. "ఇపుడు మనము చేయవలసిన కార్యము ఎట్టిది.  ఏ మిష మీద మనము రాజు దరి చేరగల వారమూ?" యనగా దమనకుడు ఇటుల బలికెను. 



English: 



Hearing the wise words of Damanaka, karaTaka asked him. " Now, what is our next step?  On what alibi shall we approach the king?" (Now that we are no longer in his good books)." Damanaka replied thus.




భయము తోడ రాజు పరుగున వచ్చెను

అరయ కారణమ్ము యంచ కేగి
పారి వచ్చుటందు పరమార్ధ మడిగెద
దౌత్య మందు యుండు దారు లారు! 29

ఱేని యండ పొంద రాచ మార్గమిదియె 
యనగ కరటకుండు యిటుల యడిగె  
స్వామి భయ పడెనన సాక్ష్య మేమి కలదు  
యనగ దమనకుండు యిటుల బలికె! 30


తాత్పర్యము



"రాజు మిగుల భయముతో నీరు త్రావకుండ కొలను నుంచి పరుగిడి తిరిగి వచ్చెను. కారణ మెరిగే మిషతో యాతని చెంతకు చేరి, అలా భయంతో పరుగెట్టి వచ్చుటకు కారణము తెలిసికొనెదను. దౌత్యము నెరపడానికి ఆరు సూత్రాలను పెద్దలు చెప్పి యున్నారు. రాజు దరి చేరడానికి యిదియే ప్రస్తుతము మనకు అందుబాటులో ఉన్న మారగము." అనగా, కరటకుడు "రాజు భయపడెననుటకు మన వద్ద సాక్ష్యము యేమున్నది?" యని సందేహము వెలిబుచ్చెను. అంత దమనకుడు ఇటుల బలికెను.



English:



"The king rushed back from the lane without drinking water in fear. On the pretext of knowing the reason for his fear, I will approach him. Elders say there are six methods in diplomacy. For the present this is the only way we can approach him." "But what is the proof that the king was afraid" Karataka expressed a doubt and Damanaka replied thus.




భంగిమందు మార్పు పరిభాష పఱపుయు 

వాచ్య రీతి మరియు చూచు తీరు 
మోము నందు మారు ముఖ కవళికలును 
మనసు పడెడి ఘోష మనకు దెలుపు!  31


తాత్పర్యము

సీసము 




దమనకుడు దెలిపె తనకు యెల్ల యెరుక

     సేవ ధర్మము సేవ సేయు టెటుల



యనగ కరటకుడు యగునీకు శుభమనె 

     దమనకుడు చనియె ధవుని కడకు 



మృగరాజు గురుతించి మంత్రి తనయుడంచు 

     పింగళకుడు యతని బిలిచె బ్రేమ 



ముందు కాళ్ళను వంగి మొక్కె దమనకుడు 

     సేమ మడిగి రాజు శంక దీర్చె 



ఆటవెలది




చాల దినము లాయ చూడక నిను నేను

యనియె మృగపు ఱేడు యెంతొ బ్రీతి 
యనగ దమనకుడు యతి వినయమ్ముగ
యనియె రాజ వచ్చి యేమి చేతు!   32
  
తాత్పర్యము


దమనకుడు తనకు సేవా ధర్మము గూర్చి యంతయు తెలుసునని ధైర్యము చెప్పిన పిమ్మట, కరటకుడు యతనికి శుభమగునని సంతసమున రాజు కడకు పంపెను. దమనకుడు రాజు కడకు పోగా యతని మంత్రి కొమరుడని గుర్తించిన రాజు దగ్గరకు రమ్మని ప్రేమతో పిలిచెను. దమనకుడు మృగరాజు పింగళకుని కాళ్ళకు మ్రొక్కగా, రాజు యతని క్షేమ సమాచారములడిగి దమనకుని మనస్సును సమాధాన పరిచెను. మరియు, "ఏమి దమనకా! నిన్ను చూచి చాలా రోజులైనది" యని ప్రేమంబున యడిగెను. దమనుకుడు అతి వినయముగా, "రాజా! చేయు కార్యము ఏమియు లేనపుడు నేను వచ్చి ఏమి చేయ గలవాడను" యని పలికెను.



English: 



Damanaka confidently told Karataka that he knew well about service to the kings and Karataka wished him well and sent him to the King Pingalaka.  When Damanaka approached, the king recognized him as the son of his minister and invited him with affection. He cleared any apprehension in the mind of Damanaka asking him about his well being. Further he affectionately asked him, "Damanaka! I have not seen you for many days, why is it so?" Damanaka who fell on the feet of king in reverence earlier said, "Oh! King! When there is no work to do, what is the use of coming and going?'





మత్తకోకిల 


కార్య మొకటి లేక కొల్వుకు రాజ రాగను యుక్తమే 
పారదృశ్యులు బల్కె కాద నృపాల యల్పులు యున్నతుల్ 
పారమార్ధపు చింతతో ప్రభు పొంత చేరుట భావ్యమౌ
కోరి వచ్చితి దెల్పరే తము ఖిన్ను లౌటది యేలనో! 33


తాత్పర్యము



దమనకుడు రాజుతో మరల నిటు బలికెను. "రాజా! చేయు పని ఏమియు లేనపుడు ఊరికే కొలువుకు వచ్చి పోవుట ధర్మమా?  ప్రభువును దర్శించవలెనన్న ఉన్నత స్థానములలోఉన్న వారు కాని, అల్పులు కాని పరమార్ధ చింత కల వారై యుండాలని పెద్దలు చెప్పిరి కదా? నేను ప్రస్తుతము వచ్చుటకు కారణము తమరు ఖిన్నులై యండుటకు కారణమేమై యుండునో తెలీకొనుటయే! " 



English:



Damanaka aid to the king. " My Lord! hen there is no work, it i not advisable to come to the Court, so said elders.  It is said that whether it is people in good positions or minions should approach the King with a Divine purpose. Reason I came to you is to know why you were sad today." 






ఆటవెలది

  
కార్య సాధకుడవొ కొరగాని వాడవొ 
మంత్రి కొమరు డెపుడు మాకు సఖుడె 
యనియె పింగళకుడు యేమి చెబుదు 
క్షేమ ముండ లేను కాన లోన!  34


తాత్పర్యము



మత్తకోకిల 


క్రూర జంతువు యేదొ యొక్కటి ఘోరమౌ ధ్వని సేయగా
దూర జాలని కాన లందున ధైర్య మెట్టుల యొచ్చెనో  
యర్వగా యిటు రాజునేనె భయాన పర్గిడి వచ్చితే  
క్రూరుడౌ యెదొ జంతువొక్కటి కానలం జొచ్చెనో! 35




ఆటవెలది


పారి వస్తి నేను భయముతొ వెనుకకు
వాసి తోచు నాకు వనము వదల
యనగ దమనకుండు యిటులను బలికెను 
మ్రోత లెపుడు మనల మోస పరచు! 36


తాత్పర్యము



రాజు పింగళకుడు ఇటుల బలికెను. "దమనకా! నీవు కార్య సాధకుడవో లేక ఎందుకూ పనికి రాని వాడవో నాకు తెలియదు. కాని మత్రి కొడుకుగా నువ్వు మాకు ఎప్పుడూ ప్రీతి పాత్రుడవే. ఏమి చెప్పమందువు? ఈ అడవిలో నాకు భద్రత కరవైనది.ఏదో ఒక క్రూర జంతువు ఈ అడవిలోకి వచ్చినది. పెద్ద శబ్దము చేయగా నేనే పరుగిడి వచ్చితిని. చిన్న జంతువు కూడ చొరబడలేని ఈ అడవిలోకి ఇంత భయంకరమైన జంతువు ఎలా వచ్చినదో. ఆ ధ్వని వినిన నేను పారిపోయి వచ్చితిని. ఆలోచించగా ఈ అడవి వదలి వెళ్ళుట మించి నాకు మార్గము తోచుట లేదు" అనగా దమనకుడు " రాజా! ఒక్కో పర్యాయము ధ్వనులు మనలను మోసపరచ వచ్చును.   



English: Hearing Damanaka'a words Pingalaka, the king said, " Damanaka! I am unaware whether you are a go-getter or goo-for-nothing guy. Today I heard a big roar from a very huge animal and ran back without partaking of water. I wonder how such a ferocious animal entered this forest where even a small animal can not enter.  I ran away hearing his roar. On thinking deep, I feel it is advisable to leave this forest" Damanaka repplied, "Oh! King! Sometimes noises deceive us" 



ఆటవెలది

జంబుకమ్ము యొకటి శబ్ద భయము నుండి
యెటుల కాచు కొనెనొ యెనుగ చెబుదు
రాజ వినుము యనగ రాజు చెప్పుమనియె
కధను ఇటుల దమనకుండు చెప్పె! 37


తాత్పర్యము



ఆటవెలది


అడవి తిరుగు చుండు ఆకలి గొని నక్క

యుద్ధ భూమి చూసి యొకచొ యాగె
శబ్ద మొకటి వినియు జంబుకమ్ము బెదిరె 
తిరిగి పోద మనుచు తలచె నక్క! 38


తాత్పర్యము



ఆటవెలది


ఒక్క నిమిష మాగి యోచించె యిటులను 
పారి పోగ రాదు భయమున యిటు
శబ్ద మూల మేమి చేసెద రెవరిట  
కలవర పడ తగదు కనుల గనక! 39


తాత్పర్యము


ఆటవెలది

శబ్ద మూల మేమి శోధన సెయనగు 
చేసె దెవరు యాగి చూడ నగును 
గుబులు సంతసమ్ము కలుగ కారణమును 
యెరుగ నోపు నంచు యార్య సూక్తి! 40


తాత్పర్యము


దమనకుడు శబ్దమునకు భయపడిన జంబూకము కధ చెప్ప దొడగెను. "రాజా! ఒకానొక జంబూకము శబ్ద భయము నుండి తనను తాను ఎలా సమాధాన పరచుకొనెనో చెప్పెద వినుము. ఆకలి గొన్న ఒక జంబూకము ఆహరము కొరకు వెదకుచు యొక యుద్ధ భూమి చూసి యొకచో యాగెను. అంతట ఒక శబ్దము విని బెదిరి వెనుకకు తిరిగి పోదమన్న యోచన చేసెను. కాని, మరల ఒక నిమిష మాగి నక్క ఇటుల యోచించెను. భయపడి పారి పోయి ప్రయోజనము లేదు. ఈ శబ్దము ఎటనుంచి వచ్చెను, ఈ యుద్ధ భూమిలో ఈ శబ్దము చేసెడి వారెవరు? స్వయంగా కనులతో చూసి తెలిసికొని కాని వెనుకకు మరల రాదు. శబ్ద మూలమేమో పూర్తిగా శోధించ వలెను. శబ్దము ఎవరు చేసిరో యాగి చూడ వలెను. దుఃఖమునకు, సంతసమునకు గల కారణము తెలిసికొనవలెనని ఆర్యులు నుడివిరి కదా? 


English:

Damanaka started telling the story of a fox that feared a sound. "Oh! King! I will tell you the story of a fox that was afraid of an unknown sound and secured itself from the fear. Once upon a time, a fox that was hungry landed in a war field while searching for food. As he was standing there he heard a huge sound. Initially he ws very afraid and wanted to go back. But on second thought he wanted to know the origin of the sound and who made it. :It is apt to go deep into the reasons for our agony and happiness; so said elders." thought the fox.


                                 ################
SATYAMEVA JAYATHE